సీట్లు తగ్గాయి సరే .. ఓటు షేర్ పెరిగింది కదా .. కేటీఆర్ భాష్యం
హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆశించిన సీట్లు రాకపోయిన .. ఓటు శాతం పెరిగిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో కంటే 6 శాతం తమ పార్టీకి పెరిగిందని గుర్తుచేశారు. తాము 16 సీట్లు వస్తాయని ఆశించింది .. నిజమేనని కానీ ట్రెండింగ్ కాస్త డిఫరెంట్‌గా అనిపించిందని వివరించారు.
అంచనా వేయలేకపోయాం ..
లోక్‌సభ ఎన్నికల్లో ట్రెండింగ్ విచిత్రంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై అంచనాలు తప్పయన్నారు. గెలిచే చోట కొన్ని ఓట్ల తేడాతో పరాజయం పొందామని గుర్తుచేశారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు .. గెలుపు కాదన్నారు. భారీ మెజార్టీ సాధించలేదని .. అది నామమాత్ర విజయం కిందకొస్తుందన్నారు. దేశంలో అతిపెద్ద నియోజకవర్గంలో 10 వేల ఓట్ల తేడాతో విజయం .. విజయం కాదన్నారు.

మోదీ వేవ్ ..
దేశంలో ప్రధాని మోదీ అనుకూల పవనాలు వీచాయని గుర్తుచేశారు. అందుకే కొన్నిచోట్ల బలహీనమైన బీజేపీ అభ్యర్థులు ఉన్నా .. విజయం సాధ్యమైందని వివరించారు. ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలే ఊహించలేదన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 16 సీట్లు గెలువాలనే కృతనిశ్చయంతో పనిచేశామని పేర్కొన్నారు. కానీ ప్రజాతీర్పును స్వాగతిస్తున్నామని స్పష్టంచేశారాయన. ఇది తమకు తాత్కాలికంగా స్పీడ్ బ్రేకరేనని స్పష్టంచేశారు. తాము మళ్లీ పుంజుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications