Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మునుగోడులో టీఆర్ఎస్ గెలిచింది - కానీ, వార్నింగ్ బెల్ మోగింది..!!

మునుగోడులో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా టీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ, మెజార్టీ లెక్కలు తప్పాయి. 10 వేలకు పైగా ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకర రెడ్డి విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభమైన సమయం నుంచి టీఆర్ఎస్ - బీజేపీ మధ్య గట్టి పోటీనే నడించింది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ ఆధిక్యత ప్రదర్శించింది. రెండు, మూడు రౌండ్లలో మాత్రమే బీజేపీ అభ్యర్ధి ఆధిక్యతలో నిలిచారు. ఆ తరువాత అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్ధి మెజార్టీ సాధించినా.. ఏ రౌండ్ లోనూ వెయ్యి ఓట్లు దాటలేదు. రాజగోపాల్ ఓటిమికి కాంగ్రెస్ చీల్చిన ఓట్లు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది.

TRS wins Munugode by poll against BJP with marjority of above 10 thousand votes,it leads to many equations

టీఆర్ఎస్ పోల్ మేనేజ్ మెంట్ సక్సెస్
మొత్తం 15 రౌండ్లలో 14 రౌండ్లకు సంబంధించి అధికారికంగా లెక్కలను ప్రకటించారు. అందులో టీఆర్ఎస్ కు 95,208 ఓట్లు రాగా, బీజేపీకి 85,125 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 23,604 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. పోలింగ్ పూర్తయిన తరువాత నుంచి ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ కు ఆధిక్యత ఉన్నట్లుగా అంచనాలు వెలువడ్డాయి. బీజేపీ తమకు సైలెంట్ ఓటింగ్ జరిగిందని విశ్వసించింది. చౌటుప్పల్ ఓటింగ్ పైన భారీగా రాజగోపాల్ ఆశలు పెట్టుకున్నారు. కానీ, అక్కడ కొంత మేర మాత్రమే ఆశించిన విధంగా ఆధిక్యత తెచ్చుకోగలిగారు. కానీ, అక్కడా కాంగ్రెస్ ఎఫెక్ట్ పడింది. ఫలితంగా రెండు, మూడు రౌండ్లలో రాజగోపాల్ రెడ్డి ఆధిక్యత సాధించినా.. ఓవరాల్ గా మాత్రం టీఆర్ఎస్ పైన మెజార్టీ సాధించలేకపోయారు. తొలి నుంచి కాంగ్రెస్ కు బలమైన కేడర్ ఉన్న మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓటమికి పని చేసినట్లు అర్దం అవుతోంది.

TRS wins Munugode by poll against BJP with marjority of above 10 thousand votes,it leads to many equations

మునుగోడులో కేసీఆర్ విభిన్న వ్యూహం
రాజగోపాల్ కొంత మంది కాంగ్రెస్ నేతలను తనతో పాటుగా తీసుకెళ్లగలిగినా.. ఓటర్ల మనసు మాత్ర మార్చలేకపోయారు. కానీ ఇదే సమయంలో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వటంలో రాజగోపాల్ సక్సెస్ అయ్యారనే విశ్లేషణలు వస్తున్నాయి. టీఆర్ఎస్ తొలి నుంచి మునుగోడులో పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నేతలందరినీ మునుగోడులో మొహరించి.. తన వ్యూహాలు అమలు చేసారు. హుజూరాబాద్ కు భిన్నంగా వ్యవహరించారు. పోల్ మేనేజ్ మెంట్ లో టీఆర్ఎస్ సక్సెస్ అయింది. అయితే, మెజార్టీ పైన మాత్రం టీఆర్ఎస్ నాయకత్వం సంతోషంగా లేదని తెలుస్తోంది. దాదాపు 25 వేల పైగా మెజార్టీతో బీజేపీకి సమాధానం చెప్పాలని భావంచి..దానికి తగిన విధంగా లెక్కలు..వ్యూహాలు సిద్దం చేసినా, మెజార్టీ తగ్గింది. బీఆర్ఎస్ ప్రకటన తరువాత జరిగిన తొలి ఎన్నికలో బీజేపీ నుంచి ఈ స్థాయిలో పోటీ ఎదుర్కోవటం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశంగా విశ్లేషకులు సూచిస్తున్నారు.

TRS wins Munugode by poll against BJP with marjority of above 10 thousand votes,it leads to many equations

రాజగోపాల్ ఆశలు ఆవిరి
చౌటుప్పల్ తో పాటుగా చండూరు అదే విధంగా నాంపల్లి పైన బీజేపీ ఆశలు పెట్టుకుంది. కానీ, గ్రామీణ ప్రాంతంలో టీఆర్ఎస్ కు మెజార్టీ ఓట్లు పోలవ్వటంతో బీజేపీ ఆశలు ఏవీ ఆచరణ రూపంలో అమలు కాలేదు. కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఎవరు గెలిచినా అయిదు వేల ఓట్ల తేడాతో గెలుస్తారని అంచనా వ్యక్తం చేసారు. ఇప్పుడు చివరగా టీఆర్ఎస్ అభ్యర్ధి ఓట్లతో విజయం సాధించారు. ఇదే సమయంలో మునుగోడులో బలం లేని బీజేపీ దాదాపు 85 వేల ఓట్లకు పైగా సాధించటంతో గులాబీ నేతలు ఆలోచించాల్సిన అసవరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ తమకు బలం తగ్గలేదని చెబుతున్న సమయంలోనే.. ఈ స్థాయిలో బీజేపీకి ఓట్లు పోలవ్వటం వెనుక విశ్లేషణ అవసరమనే అభిప్రాయ వ్యక్తం అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+