కామారెడ్డి నుంచి బరిలో కేసీఆర్, ఎంఐఎంతో పొత్తు- బీఆర్‌ఎస్ జాబితా విడుదల..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్దుల జాబితా ప్రకటించారు. ఒకే సారి 115 మంది అభ్యర్దులను ఖరారు చేసారు. అందులో ఏడుగురు సిట్టింగ్ లకు సీట్లు నిరాకరించారు. ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగా గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఎంపిక చేసారు. ముందు నుంచి చెబుతున్నట్లుగానే సిట్టింగ్ లకు ప్రాధాన్యత ఇచ్చారు. 95 సీట్లు గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారు. బోధ్, వైరా, ఖానాపూర్, కోరుట్ల, ఉప్పల్,స్టేషన్ ఘన్‌పూర్, వేములవాడ స్థానాల్లో అభ్యర్దులను మార్చారు. కంటోన్మెంట్ నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందితకు కేటాయించారు. నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి,జనగాం స్థానాలను పెండింగ్ లో పెట్టారు. ఈ సారి సిట్టింగ్ ల్లో ఏడుగురికి అవకాశం దక్కటం లేదని కేసీఆర్ వెల్లడించారు. అందులో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం కారణంగా ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమరశంఖం పూరించారు. ఎంచుకున్న ముహూర్తానికి తన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్దుల జాబితా ప్రకటించారు.

ఎమ్మెల్యే సీట్లే ప్రామాణికం కాదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. భూపాల్ పల్లిలో మధుసూధనాచారితో మాట్లాడగానే గండ్రకు అవకాశం ఇచ్చారని కేసీఆర్ వివరించారు. తాండూరు నుంచి అదే విధంగా ప్రయత్నం జరిగిదని చెప్పారు. బీఆర్ఎస్ - ఎంఐఎంతో ఒప్పందంతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. తప్పక ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. మొత్తం 119 స్థానాలకు గాను, 105 నియోజకవర్గాల అభ్యర్దుల ను ఖరారు చేసారు. సిట్టింగ్ లకే తిరిగి పెద్ద సంఖ్యలో అవకాశం కల్పించారు. వాస్తవానికి గత 2014, 2018 ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి లేదు. ఈ సారి ముందుగానే సీట్లు రావటం లేదని తెలుసుకున్న కొందరు సిట్టింగ్ లు చివరి వరకు తమ ప్రయత్నాలు కొనసాగించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇస్తామని, అయితే గెలుపే ప్రామాణికమని స్పష్టం చేసారు. వామపక్షాలతో పొత్తుల దిశగా చర్చలు జరుగుతున్న సమయంలో మూడు సీట్లు కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. ఆ సీట్లలో అభ్యర్దులను ప్రకటించలేదు. ఈ రోజు అభ్యర్దుల ప్రకటన ఉంటుందనే సమాచారంతో ముందు నుంచే సీటు దక్కదనే అనుమానంతో ఉన్న వారు చివరి నిమిషం దాకా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసారు. కేసీఆర్ విడుదల చేసే జాబితా పైన ఉత్కంఠ కొనసాగింది.














Click it and Unblock the Notifications