తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల: ఏపీ విద్యార్థుల హవా
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఎంసెట్ ర్యాంకులను విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 12న ఎంసెట్ పరీక్ష.
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఎంసెట్ ర్యాంకులను విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 12న ఎంసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ.. ఎంసెట్ సజావుగా జరిగేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంజినీరింగ్‌లో 74.75 శాతం, వైద్యవిద్యలో 86.49 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో అబ్బాయిలు పైచేయి సాధించారు.

కాగా, తెలంగాణ ఎంసెట్ లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ విభాగాల్లో ఆంధ్రా విద్యార్థులు హవా చాటాటడం విశేషం. ఇంజనీరింగ్ టాప్-10లో ఆరు ర్యాంకులు, అగ్రి, ఫార్మసీ విభాగాల్లో మొదటి 10 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు సాధించారు.
ఇంజినీరింగ్‌లో టాప్ ర్యాంకులు
1. జయంత్ హర్ష(గుంటూరు)- 156 మార్కులు
2. రాంప్రసాద్(శ్రీకాకుళం)-156
3. భరద్వాజ్- 155
4. శైలేంద్ర(తూర్పుగోదావరి)- 155
6. దిలీప్ కుమార్(అనంతర)-155
9. కృష్ణా జిల్లాకు చెందిన అబ్దుల్ మూయిజ్-154 మార్కులు












Click it and Unblock the Notifications