TS Elections : సాగర్ పై మాట్లాడొద్దు-నేతలకు సీఈవో ఆదేశం-పోలీసులే చూసుకుంటారని...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం నుంచీ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ బూత్ లకు ఓటర్లు క్యూ కట్టారు. అదే సమయంలో పోలింగ్ కు ముందు రోజు రాత్రి నాగార్జున సాగర్ డ్యామ్ పై ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏపీ పోలీసులు అర్ధరాత్రి డ్యామ్ పైకి వెళ్లి సగం గేట్లను ఆక్రమించారు. ఏపీ పరిధిలోకి వచ్చే గేట్ల వద్ద బ్యారికేడ్లను పెట్టారు. దీనికి అభ్యంతరం తెలిపిన తెలంగాణ పోలీసులకు చుక్కెదురైంది.
నాగార్జున సాగర్ డ్యామ్ పై తమ పరిధిలో ఉన్న గేట్ల వరకూ బ్యారికేడ్లు పెట్టిన ఏపీ అధికారులు.. ఆ తర్వాత 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఏపీ నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు సాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువ నుంచి నీటిని విడుదల చేసినట్లు ట్వీట్ చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు దీనిపై స్పందించడం మొదలుపెట్టారు. ఎన్నికల పోలింగ్ సమయంలో సాగర్ వ్యవహారాన్ని కెలకడం దేనికి సంకేతమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ దీనిపై స్పందించారు. పోలీసులతో నిరంతరం టచ్ లో ఉంటూ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన.. రాజకీయ పార్టీలకు సాగర్ వ్యవహారంపై స్పందించకుండా సంయమనం పాటించాలని కోరారు. సాగర్ వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని ఆయన రాజకీయ పార్టీలకు తెలిపారు. అదే సమయంలో సాగర్ వద్ద పరిస్దితిపై ఆయన డీజీపీతో పాటు ఇతర అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల పోలింగ్ ముగిసే వరకూ నేతలు మాత్రం నోరు విప్పొద్దని ఆయన సూచించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications