ఎమ్మెల్యే ఎరకేసు ఢిల్లీ సీబీఐకి అప్పగింత: బీఆర్ఎస్, బీజేపీపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ ఢిల్లీ విభాగానికి హైకోర్టు అప్పగించింది. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ క్రమంలోనే సీబీఐ ఢిల్లీ ఎస్పీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌కు వచ్చింది. సిట్ నుంచి కేసు పత్రాలు ఇవ్వాలని సీఎస్‌కు సీబీఐ లేఖ రాసింది.
అయితే సోమవారం వరకు కేసు ఫైళ్ల కోసం ఒత్తిడి చేయవద్దని సీబీఐకి హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ అప్పీలుపై సోమవారం స్పష్టత వచ్చాక.. ఎఫ్‌ఐఆర్ నమోదు యోచనలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఉంది.అంతకుముందు కేసు ఫైల్స్ కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సుప్రీం న్యాయవాది దవే వాదనల కోసం.. సోమవారం వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

కేసు సీబీఐకి ఇవ్వడమే సరైందని హైకోర్టులో బీజేపీ వాదనలు వినిపించింది. 2014 నుంచి 37 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని న్యాయస్థానానికి తెలిపింది. బీజేపీ పిటిషన్‌ను కొట్టివేసినా.. అప్పీల్ ఎందుకు చేశారని ఏజీని హైకోర్టు అడిగింది.
పిటిషన్ కొట్టివేయడానికి కారణాలు సరిగా లేవని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ అంశాలు బయటే చూసుకోవాలని వ్యాఖ్యానించింది. ఈ అంశాలు కోర్టులోకి తీసుకురావద్దని, అదంతా బయట చూసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం విచారణను సోమవారంకు వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది దుష్యంత్ ఢిల్లీలో ఉన్నారని, సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోరారు. సోమవారం కూడా దవే ఢిల్లీలోనే ఉంటారని, ఆన్‌లైన్ విధానంలో విచారణ జరపాలని ఏజీ కోరడంతో హైకోర్టు అంగీకరించింది.












Click it and Unblock the Notifications