స్ట్రాంగ్ రూం తాళం పగలగొట్టండి: ధర్మపురి ఎన్నిక వివాదంపై హైకోర్టు కీలక ఆదేశం
హైదరాబాద్: జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. 2019లో కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే, ఆయన ఎన్నిక చెల్లదని.. అందులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్నుంచి కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది.
ఎన్నికలకు సంబంధించి డాక్యుమెంట్లు, వీవీ ప్యాట్లు, సీసీ ఫుటేజీ కావాలని లక్ష్మణ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. లక్ష్మణ్ అడిగిన సమాచారం ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. అవన్నీ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి ఉన్నాయని రిటర్నింగ్ అధికారి చెప్పడంతో.. స్ట్రాంగ్ రూం తెరిచి రిటర్నింగ్ అధికారి అడిగిన డాక్యుమెంట్లు మొత్తం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఇటీవల ధర్మపురిలో ఉన్న స్ట్రాంగ్ రూంను తెరిచేందుకు కలెక్టర్ ప్రయత్నించారు. మొత్తం మూడు గదుల్లో ఎన్నికల సామాగ్రి ఉండగా.. ఒక గది తాళాలు తెరవలేకపోయారు.

తాళం చెవి సరిపోలక స్ట్రాంగ్ తెరవలేకపోయామని జిల్లా కలెక్టర్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల డాక్యుమెంట్లు కావాలంటే స్ట్రాంగ్ రూం తాళం పగలగొట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. స్ట్రాంగ్ రూం తాళాల గల్లంతుపై ముగ్గురు అధికారులతో విచారణ జరిపిస్తున్నామి.. పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తామని ఎన్నికల అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే, లక్ష్మణ్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉద్దేశపూర్వకంగానే తాళం చెవి మాయం చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. స్ట్రాంగ్ రూం సీల్ పగలగొట్టేందుకు జగిత్యాల కలెక్టర్‌కు అనుమతించింది. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవాలని సూచించింది. రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం, తగిన భద్రత ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే వడ్రంగి, లాక్‌స్మిత్ సహకారం తీసుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్ 24కు వాయిదా వేసింది హైకోర్టు.
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ సీల్ పగలగొట్టాలని జిల్లా కలెక్టర్ కు అనుమతిచ్చింది హైకోర్టు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై ఏప్రిల్ 19 న హైకోర్టులో విచారణ సందర్భంగా.. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూం తెరవాలని కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం, భద్రత ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశాలిచ్చింది. అవసరమైతే వడ్రంగి, లాక్ స్మిత్ సహకారం తీసుకునేందుకు అనుమతిచ్చింది. స్ట్రాంగ్ రూం తాళాల గ్లలంతుపై ముగ్గురు అధికారులతో విచారణ జరిపిస్తున్నామని ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 24కి వాయిదా వేసింది కోర్టు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications