ఏపీలో ఆరు గంటలు కరెంటు కట్ -తెలంగాణ ఎంతో బెటర్-హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలుగా 2014లోనే విడిపోయినా ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఇరు రాష్ట్రాల మధ్య ప్రతీ అంశంలోనూ రాజకీయ నేతలు పోలికలు తెస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన అధికార పార్టీ టీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఏపీతో ప్రతీ అంశంతో పోలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో రోడ్లపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు మరో మంత్రి హరీష్ రావు విద్యుత్ కోతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

హరీష్ రావు కామెంట్స్

హరీష్ రావు కామెంట్స్

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీలో విద్యుత్ కోతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యుత్ సరఫరాను ఏపీలో విద్యుత్ కోతలతో ఆయన పోల్చారు. ఏపీ పర్యటనలో తాజాగా తాను విచారిస్తే విద్యుత్ కోతల వ్యవహారం తెలిసిందన్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదన్నారు. దీంతో ఇప్పుడు హరీష్ రావు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతీ విషయంలోనూ తాము బెటర్ అని చెప్పుకునేందుకు ఏపీతో పోల్చడం తెలంగాణ మంత్రులకు అలవాటుగా మారిందన్న చర్చ జరుగుతోంది.

ఆరుగంటల కోతలన్న హరీష్ రావు

ఆరుగంటల కోతలన్న హరీష్ రావు

తాజాగా తాను తిరుమలలో పర్యటించినప్పుడు అక్కడ దర్శనానికి వచ్చిన వారిని అడిగితే కరెంటు కోతల విషయం బయటపడిందన్నారు. ఏపీలో ఆరు గంటల పాటు కరెంటు కోతలున్నాయని హరీష్ రావు తెలిపారు. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు కరెంటు పోతోందన్నారు. దీంతో అక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు హరీష్ రావు తెలిపారు. దీనికి విరుద్ధంగా తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం పూర్తిస్ధాయిలో విద్యుత్ సరఫరా చేస్తోందన్నారు. అంతే కాదు తెలంగాణలో 24 గెంటలు నిరంతరాయంగా విద్యుత్ అందుతుందని అనుకున్నామా అని ప్రజల్ని ఆయన ప్రశ్నించారు.

 హరీష్ రావు వ్యాఖ్యల వెనుక ?

హరీష్ రావు వ్యాఖ్యల వెనుక ?

తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. కేసీఆర్ ప్రభుత్వానికి విపక్ష బీజేపీ ప్రతీ విషయంలోనూ సవాళ్లు విసురుతోంది. వీటిని తిప్పికొట్టేందుకు అపసోపాలు పడుతున్న తెలంగాణ సర్కార్.. ఎనిమిదేళ్లుగా చెప్తున్న 24 గంటల విద్యుత్ అంశాన్ని మరోసారి తెరపైకి తెస్తోంది. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, ఛత్తీస్ ఘడ్ తో పోలుస్తూ తాము మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పుకుంటోంది. ఇదే క్రమంలో హరీష్ రావు ఏపీలో ఆరు గంటల విద్యుత్ కోతలున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో తామే మెరుగ్గా ఉన్నట్లు చెప్పుకున్న ప్రయత్నం చేస్తున్నారు.

 స్పందించని వైసీపీ

స్పందించని వైసీపీ

గతంలో ఏపీలోని రోడ్ల దుస్ధితిపై కేటీఆర్ వ్యాఖ్యలు చేసినప్పుడు వైసీపీ మంత్రులు, సలహాదారులంతా కలిసి తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ ను 24 గంటల్లోపే క్షమాపణ చెప్పించారు. దీంతో అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కానీ ఇప్పుడు హరీష్ రావు ఏపీలో కరెంటు కోతలపై చేసిన వ్యాఖ్యలపై మాత్రం వైసీపీ మంత్రులు ఇంకా స్పందించలేదు. హరీష్ రావుతో పోలిస్తే కేటీఆర్ కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అప్పట్లో వైసీపీ మంత్రులు అలా స్పందించారా అన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఎన్నికల వేళ టీఆర్ఎస్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+