బండి సంజయ్, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కొరడా- జాయింట్‌గా

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఉదంతం.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం. రాజకీయంగా పెను దుమారానికి దారి తీసిందీ ఘటన. వేలాదిమంది నిరుద్యోగులను నిరాశలో ముంచెత్తింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కారణంగా పరీక్షలు కూడా రద్దయ్యాయి. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ కొనసాగిస్తోన్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ సహా ఈ కేసులో ప్రమేయం ఉందని భావిస్తోన్న పలువురిని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు 15 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో వందకు వంద 100 మార్కులు సాధించిన.. 20 మంది అభ్యర్థుల నుంచి కూడా సిట్ అధికారులు వివరాలను రాబట్టుకున్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రాలను లీకేజీ కేసులో నిందితులు డాక్యానాయక్‌ను కీలక విషయాలను సేకరించారు. వారి నుంచి ఎవరెవరికి పేపర్లు వెళ్లాయనే విషయంపై ఆరా తీస్తోన్నారు.

TSPSC paper leak: KTR issued Rs 100 crore defamation notices to Bandi Sanjay and Revanth Reddy

ఈ వ్యవహారం అటు రాజకీయంగా పెను దుమారానికి దారి తీసింది. అధికార భారత్ రాష్ట్ర సమితిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు రాజకీయ ప్రత్యర్థులు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వేర్వేరుగా ఆందోళనలను చేపట్టాయి. నిరసన ప్రదర్శనలను నిర్వహించాయి. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడం కూడా ప్రభుత్వానికి చేతకావట్లేదంటూ మండిపడ్డాయి.

పేపర్ల లీకేజీ వ్యవహారానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఈ ఉదంతం చోటు చేసుకుందంటూ విమర్శించారు. ఐటీ మంత్రి హోదాలో కేటీఆర్- పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వర్లన్నీ కూడా హ్యాక్ చేయించారంటూ ధ్వజమెత్తారు. పేపర్ల లీకేజీకి ఆయనే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. తనకు సంబంధం లేనప్పటికీ- ఇందులో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌పై ఇప్పటికే ఆయన ఎదురుదాడి చేశారు. ఇప్పుడు తాజాగా వారిద్దరిపైనా పరువునష్టం దావా వేశారు. దీని విలువ 100 కోట్ల రూపాయలు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీలో తన పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించినందుకు వారిద్దరిపైనా పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు కేటీఆర్ తరఫున ఆయన అడ్వొకేట్ సుధాన్షు రావు ఏనుగంటి ఈ నోటీసులను పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+