తొలి ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ: అక్టోబర్‌లో గ్రూప్-2 నోటిఫికేషన్

హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామక ప్రకటనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ఏర్పడ్డాక తొలి ఉద్యోగ ప్రకటన బుధవారం విడుదలైంది.

రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 3,783 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఈఈ ఉద్యోగాలకు సంబంధిత ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అర్హులు అని చెప్పారు.

ఏఈఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ పద్ధతిలో సెప్టెంబర్ 20న రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తులకు చివరి తేది సెప్టెంబర్ 3. మొత్తం 500 మార్కులకు పరీక్ష ఉంటుంది.

TSPSC releases fist notification in telangana

కాగా, రాత పరీక్షకు 450 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయని తెలిపారు. మరో వారం రోజుల్లో అసిస్టెంట్ ఇంజినీర్ల ఉద్యోగాల ప్రకటన కూడా వస్తుందని చెప్పారు. అసిస్టెంట్, సివిల్, మెకానికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు.

అక్టోబర్ చివర్లో గ్రూప్-2 నోటిఫికేషన్

టీఎస్‌పీఎస్సీ ద్వారా నిర్వహించబోయే పరీక్షలకు ఆగస్టు నెలఖారులోగా సిలబస్‌ను పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. అక్టోబర్ చివర్లో గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. గ్రూప్-1 నిర్వహణలో కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు.

TSPSC releases fist notification in telangana

కాగా, అక్టోబర్ నాటికి కమల్‌నాథన్ కమిటీ నివేదిక వస్తే మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, అక్టోబర్ నెలలో గ్రూప్-2 నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. డిసెంబర్‌లోగా దాదాపు 80 శాతం ఉద్యోగాల భర్తీ జరుగుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖలో కూడా ఉద్యోగాలకు సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+