హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్: సిటీ బస్సుల్లో జనరల్‌ పాస్‌ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త - 800 బస్సుల వేలం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ సిటీ, శివారు ప్రాంతాలకు చెందిన లోకల్ బస్సు ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని జనరల్‌ బస్‌పాస్‌ హోల్డర్లకు లాక్‌డౌన్‌ సమయంలో కోల్పోయిన బస్‌పాస్‌ వాలిడిటీని పెంచుతున్నట్లు తెలిపింది. టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ట్రంప్ డబ్బులు మాయం -హ్యాకర్ల పంజా - రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి గుట్టుగా..ట్రంప్ డబ్బులు మాయం -హ్యాకర్ల పంజా - రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి గుట్టుగా..

కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ సేవలను సెప్టెంబర్ లోనే ప్రారంభించిన సంస్థ.. హైదరాబాద్‌లో మాత్రం ఆలస్యంగా సర్వీసులను పునరుద్ధరించింది. ప్రస్తుతం 25 శాతం బస్సులు నడుస్తుండగా, సర్వీసుల సంఖ్యను త్వరలోనే పెంచుతామని అధికారులు చెప్పారు. కాగా, జనరల్ పాస్ లకు సంబంధించి అధికారి వెంకటేశ్వర్లు ఇలా తెలిపారు.

tsrtc good news to hyderabad city bus passenger regarding general bus passes

లాక్‌డౌన్‌ కారణంగా కోల్పోయినన్ని రోజులను ఇప్పుడు వినియోగించుకునేలా బస్‌పాస్‌ దారులకు అవకాశం కల్పిస్తున్నామని, బస్‌పాస్‌ హోల్డర్లు తమ బస్‌పాస్‌తోపాటు ఐడీ కార్డులను ఆయా ప్రాంతాల్లోని కౌంటర్లలో అందజేసి, కొత్త వాటిని పొందాలని ఆర్టీసీ ఈడీ సూచించారు. పాతవి అందజేసిన ప్రతి ఒక్కరికీ కొత్త పాస్‌ జారీ చేసి నష్టపోయిన రోజులను ఇప్పుడు కలుపుతామని, పాస్ హోల్డర్లు నవంబర్‌ 30లోపు అవకాశాన్ని వినియోగించాలని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే..

బీహార్‌లో హంగ్: బీజేపీ-ఆర్జేడీ పొత్తుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు - నితీశ్‌కు ఆప్షన్ లేదన్న రవిశంకర్బీహార్‌లో హంగ్: బీజేపీ-ఆర్జేడీ పొత్తుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు - నితీశ్‌కు ఆప్షన్ లేదన్న రవిశంకర్

రాబోయే కొద్ది రోజుల్లో భారీ ఎత్తున పాత బస్సుల్ని వేలం వేసే ప్రక్రియను ఆర్టీసీ వేగవంతం చేసింది. సుమారు 800 బస్సులను వేలం వేసేందుకు సిద్ధంగా చేయగా, వాటిలో 400 బస్సుల వేలం ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. వేలానికి ఉంచిన బస్సుల్లో గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్ రీజియన్లకు చెందిన సర్వీసులే ఎక్కువగా ఉన్నాయి. 2019నాటి కార్మికుల సమ్మె తర్వాత సర్వీసుల సంఖ్యను తగ్గించిన ఆర్టీసీ.. పాత బస్సుల్లో కొన్నింటిని కార్గో సేవలకు, మొబైల్ టాయిలెట్లకు వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. మరో 800 బస్సుల్ని వేలం ద్వారా విక్రయించనున్నారు.

English summary
TSRTC has good news for General Bus Pass holders under hyderabad region. Announced that it was increasing the validity of the bus pass lost during the lockdown. Buspasses now have the opportunity to make up for lost days due to the lockdown. The RTC ED has advised bus pass holders to hand over their ID cards along with their bus pass and get new ones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X