మహిళల ఉచిత బస్సు ప్రయాణం వేళ సజ్జనార్ కీలక ప్రకటన..!!

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్యారెంటీల అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన కనిపిస్తోంది. జీరో టికెట్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోంది. ఈ సమయంలోనే గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.

టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ నిర్ణయానికి సంబంధించి ప్రకటన చేసారు. రేపటి నుంచి (జనవరి 1) నుంచి మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్ల పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాల్సి ఉంటుందని వివరించారు. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోందని చెప్పుకొచ్చారు.

TSRTC MD VC Sajjanar Annouces that withdrawal for Family -24 tickets due to Mahalaxmi Scheme implementation


దీని కారణంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని చెప్పారు ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించిందని వెల్లడించారు. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ చెప్పారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీలో కొత్త బస్సులను ప్రవేశ పెట్టారు. 80 బస్సులను ప్రారంభించగా. మరో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని సజ్జనార్ స్పష్టం చేసారు. మే లేదా జూన్ నాటికి రూ 400 కోట్ల ఖర్చుతో ఈ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసారు. మహిళల ఉచిత బస్పు ప్రయాణం ఇప్పటి వరకు ఆరు కోట్ల మంది వినియోగించుకున్నారని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+