TSRTC: రాష్ట్రవ్యాప్తంగా వారికి బస్సుల్లో ఉచిత ప్రయాణం: బంపర్ ఆఫర్ ఈ ఒక్కరోజే: త్వరపడండి
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా సాగాయి..సాగుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తారువాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హోరెత్తాయి. అర్ధరాత్రి వరకూ తెరచివుంచుకునే అవకాశం కల్పించడంతో మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే ఆలయాల్లో రద్దీ నెలకొంది. అన్ని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ.. భక్తులు ఆలయాలను సందర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఆలయాలు కిటకిట..
నూతన సంవత్సరం కావడంతో ఏపీ, తెలంగాణల్లో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రాకతో కోలాహలంగా మారాయి. ప్రత్యేక అలంకరణలతో ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో తెల్లవారు జాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొత్త సంవత్సరంతో పాటు శనివారం కూడా కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో చిలుకూరు ఆలయానికి భక్తులు చేరుకుంటున్నారు.

ఆర్టీసీ బంపర్ ఆఫర్..
కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ అధికారులు- బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. 12 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలకు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. తల్లిదండ్రులతో కలిసి బస్సుల్లో రాకపోకలు సాగించే 12 సంవత్సరాల లోపు వయస్సు ఉండే పిల్లలకు టికెట్ తీసుకోదు. వారు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమే పరిమితం చేశారు. పిల్లలకు కొత్త ఏడాది కానుకగా ఈ వెసలుబాటును కల్పించింది.

పేరెంట్స్ ఉంటేనే..
తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే వారికి మాత్రమే ఈ అవకాశం ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో 12 ఏళ్ల లోపు పిల్లలు ఉచితంగా ట్రావెల్ చేయవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో తిరిగే సిటీ బస్సుల్లో కూడా ఈ విధానం వర్తిస్తుంది. ఈ మేరకు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఇదివరకే ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెల్లవారేంత వరకూ సిటీ బస్సులు..
కాగా- రోడ్డు ప్రమాదాలను నివారించడానికి టీఎస్ఆర్టీసీ అధికారులు మరో వినూత్న ప్రయోగాన్ని పూర్తి చేశారు. శుక్రవారం రాత్రి నుంచి ఈ తెల్లవారు జాము వరకు సిటీబస్సులను నడిపించారు. అర్ధరాత్రి 12:30 నుంచి తెల్లవారు జామున 3:30 గంటల వరకు ఎంపిక చేసిన మార్గాల్లో సిటీ బస్సులను తిప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది. ఇది సక్సెస్ అయింది.
Recommended Video

బస్ రూట్స్ ఇవే..
సికింద్రాబాద్-మేడ్చల్, సికింద్రాబాద్-షామీర్‌పేట్, ఉప్పల్-కొండాపూర్, దిల్‌సుఖ్ నగర్-లింగంపల్లి, లింగంపల్లి-మాదాపూర్, మెహదీపట్నం-శిల్పారామం, కోఠి-రామోజీ ఫిల్మ్‌సిటీ, కోఠి-మౌంట్ ఒపెరా, కోఠి-ఓషన్ పార్క్, లింగంపల్లి-ట్యాంక్‌బండ్, దిల్‌సుఖ్‌నగర్-ట్యాంక్‌బండ్, మేడ్చల్-ట్యాంక్‌బండ్, మెహదీపట్నం-శంకర్‌పల్లి, విప్రో సర్కిల్-మైత్రీవనం, కోఠి-కొండాపూర్ (వయా జర్నలిస్ట్ కాలనీ, దుర్గంచెరువు, ఐకియా), లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య ఈ బస్సులు రాకపోకలు సాగించాయి.












Click it and Unblock the Notifications