చంద్రబాబూ! సెక్షన్ 8తో వద్దు, ఢిల్లీలో పరువు తీశావ్: తుమ్మల
హైదరాబాద్: సెక్షన్ 8ని అడ్డుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గురువారం మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని తగ్గించొద్దన్నారు.
నువ్వు చేసిన తప్పు మోడీ చేసినా, మరెవరు చేసినా తప్పకుండా కేసు పెడతారని తుమ్మల అన్నారు. చంద్రబాబు ఢిల్లీలో తెలుగువారి పరువు తీశారన్నారు. ఆడియో టేప్‌లోని గొంతు పైన ఇప్పటి వరకు చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదని చెప్పారు.
చంద్రబాబు స్థాయి నేత అజ్ఞానంతో మాట్లాడటం విడ్డూరమన్నారు. మాటలతో మభ్యపెట్టాలనుకుంటే కుదరదని చెప్పారు. తాను మాట్లాడలేదంటారు, అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ అంటారని మండిపడ్డారు.
తనను అరెస్టు చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి అదే ఆఖరు రోజు అంటున్నారంటే, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చుతారా అని ప్రశ్నించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తగ్గించవద్దన్నారు. ఓటుకు నోటు పైన తెలుగువారిగా తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారని చెప్పారు.

ఓటుకు నోటు వ్యవహారంలో తాము ఊరుకున్నా చట్టం ఊరుకోదన్నారు. సెక్షన్ 8ను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంతు చూడటం కాదని, ముందు నీ అంతం చూసుకోవాలన్నారు.
కుక్కతోక పట్టుకొని గోదారిని ఈదినట్లు ఆయన తీరు ఉందన్నారు. ఇప్పటికైనా హుందాగా వ్యవహరించాలని, ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని తగ్గించొద్దన్నారు. దొంగా - పోలీస్ మధ్య జరుగుతున్న వ్యవహారంలో ప్రభుత్వాన్ని లాగవద్దన్నారు.
పాలమూరు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసిన కేసీఆర్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం ఉదయం పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎత్తిపోతల పథకం స్థూపాన్ని సీఎం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
తల తాకట్టు పెట్టి అయినా పాలమూరుకు నీరు వచ్చేలా చేస్తానని చెప్పారు. ప్రతి 10 రోజులకు ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తానని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరుపై వివక్ష కొనసాగిందన్నారు. జీవితంలో మంచి పనులు చేసే అవకాశం, ప్రజల దుఃఖంలో పాలు పంచుకునే అవకాశం తనకు దొరికిందన్నారు.
ప్రాజెక్టు కింద ముంపుకు గురయ్యే వారికి ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి భూమి ఇస్తామన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పైన కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ?












Click it and Unblock the Notifications