అనంతలో రోడ్డు ప్రమాదం: ఇన్నోవా ఢీకొట్టడంతో ఇద్దరు అన్నదమ్ముల మృతి
మృతులను వడ్డే లక్ష్మయ్య(38), వడ్డె రామాంజనేయులు(45)లుగా గుర్తించారు.
అనంతపురం: అనంతపురం జిల్లా కూడేరు మండలం గొట్కూరులో ఓ ఇన్నోవా వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. కూడేరు మండలం ఇప్పేరుకు చెందిన వడ్డే లక్ష్మయ్య(38), వడ్డె రామాంజనేయులు(45) అనంతపురం నుంచి తమ స్వగ్రామానికి బైక్ పై బయలుదేరారు. అలా గొట్కూరు సమీపంలోకి రాగానే.. అనంతపురం వైపు వెళ్తున్న ఇన్నోవా వాహనం వీరి బైక్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన రామాంజనేయులును చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతను కూడా మరణించాడు.












Click it and Unblock the Notifications