పిల్లల కిడ్నాప్: తండ్రి మృతితో కొడుకు ఆత్మహత్య
రంగారెడ్డి: ఇద్దరు చిన్నారులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నార్సింగి మండలం హైదర్‌షాకోటలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసముండే వెంకటయ్యకు అనిత(6), అరుణ్(4) అనే ఇద్దరు పిల్లలున్నారు.
ఈ ఇద్దరు పిల్లలను గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. పిల్లలిద్దరినీ ఆటోలో తీసుకెళుతుండగా అదృష్టవశాత్తూ కిడ్నాపర్ల చెర నుంచి అనిత తప్పించుకుంది. అరుణ్‌ను కిడ్నాపర్లు ఆటోలో తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని అరుణ తన తండ్రి వెంకడయ్యకు వివరించింది. వెంకటయ్య నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

కరెంట్ షాక్‌తో తండ్రి మృతి: కొడుకు ఆత్మహత్య
వరంగల్: జిల్లాలోని ఆత్మకూరు మండలం గూడెప్పాడులో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రభాకర్ అనే రైతు పొలంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. తండ్రి మరణవార్త విని కొడుకు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తండ్రి కొడుకులు ఒకే కుటుంబంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బిజెపి నేత హత్య కేసు నిందితుల అరెస్ట్
వరంగల్ జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన బిజెపి నేత, సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ కంటిపూడి సత్యనారాయణ హత్యకేసు మిస్టరీ వీడింది. ఈ హత్యలో ప్రధాన సూత్రధారి అయిన మంగపేట పిఏసిఎస్ చైర్మన్ వల్లెపల్లి శివప్రసాద్ సహా మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ములుగు డీఎస్పీ రాజమహేంద్రనాయక్ సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.
నిందితుల నుంచి ఇండికా కారుతోపాటు ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు పాల్పడ్డ తిప్పర్తి ప్రసాద్, నాదెండ్ల హరీ ష్, మల్‌రెడ్డి సురేందర్‌రెడ్డి, ముస్కె నర్సింగం, వల్లెపల్లి శివప్రసాద్, కంశెట్టి కృష్ణలను అరెస్ట్ చేశారు. కాగా, మహేందర్, రవీందర్, సురేష్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన మరో కారును స్వాధీనపర్చుకోవాల్సి ఉందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications