ఏడుపాయల వద్ద విషాదం.. నీటమునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
ఏడుపాయల వద్ద విషాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట పరిధిలోని ఘన్‌పూర్ ప్రాజెక్టులో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందారు.
మెదక్: ఏడుపాయల వద్ద విషాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట పరిధిలోని ఘన్‌పూర్ ప్రాజెక్టులో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ శివారు సూరారం కాలనీలోని ప్రణతి డిగ్రీ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఏడుపాయల వనదుర్గామాతా దర్శనం కోసం ద్విచక్రవాహనాలపై వెళ్లారు.

ఈ సందర్భంగా వారు ఘన్‌పూర్ ప్రాజెక్టులో స్నానం చేసేందుకు దిగారు. ప్రమాదవశాత్తూ నీటమునిగి సూరారంకాలనీకి చెందిన ఆనంద్(18), గండిమైసమ్మ చౌరస్తాకు చెందిన సిద్దార్థ(18) ప్రాణాలు కోల్పోయారు.
తోటి విద్యార్థులు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పాపన్నపేట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్‌రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications