ఏ సర్టిఫికేట్లు లేకున్నా పాస్‌పోర్టుల ఇచ్చేస్తారు: ముఠా గుట్టురట్టు(పిక్చర్స్)
కరీంనగర్: ఎలాంటి ధ్రువీకరణపత్రాలు లేకున్నా.. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి పాస్‌పోర్టులు ఇప్పిస్తూ వేలాది రూపాయలు దండుకుంటున్న ముఠాను కోరుట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులను ఆదివారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మీడియా ఎదుట హాజరుపరిచి, ఎస్పీ జోయల్ డేవిస్ వివరాలు వెల్లడించారు.
కోరుట్ల మండలం యాకీన్‌పురా గ్రామానికి చెందిన కొప్పుల శేఖర్ పాస్‌పోర్టు కోసం ఎండీ కమ్రుద్దిన్‌ను సంప్రదించగా రూ. 35,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బు తీసుకుని కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన శేఖర్ మే 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించగా ముఠా అక్రమాలు వెలుగుచూశాయి.
హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌సత్తార్ 15 ఏళ్లు దుబాయిలో కంప్యూటర్ గ్రాఫిక్స్ వృత్తి నిర్వహించాడు. తిరిగి వచ్చిన సత్తార్ తనకున్న పరిజ్ఞానంతో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్హత పత్రాలు సృష్టించి వాటిద్వారా పాస్‌పోర్టులు ఇప్పించే పనిని ఎన్నుకున్నాడు. ఇందుకోసం అనేక ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకున్నాడు.
అయితే, శేఖర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కమ్రుద్దిన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. సత్తార్ వ్యవహారం బయటపడింది. దీంతో హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లిన పోలీసులు అబ్దుల్‌సత్తార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నకిలీ విద్యార్హత పత్రాలు, జనన ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్టులు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు ఇప్పటివరకు ఎన్ని పాస్‌పోర్టులుకు సంబందించి నకిలీ ధ్రువీకరణపత్రాలు సృష్టించారన్న విషయంపై దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ అన్నపూర్ణ, సీఐ రాజశేఖర్‌రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

నిందితుల అరెస్ట్
ఎలాంటి ధ్రువీకరణపత్రాలు లేకున్నా.. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి పాస్‌పోర్టులు ఇప్పిస్తూ వేలాది రూపాయలు దండుకుంటున్న ముఠాను కోరుట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ పాస్‌పోర్టులు
పట్టుబడిన నిందితులను ఆదివారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మీడియా ఎదుట హాజరుపరిచి, ఎస్పీ జోయల్ డేవిస్ వివరాలు వెల్లడించారు.

నిందితులు
కోరుట్ల మండలం యాకీన్‌పురా గ్రామానికి చెందిన కొప్పుల శేఖర్ పాస్‌పోర్టు కోసం ఎండీ కమ్రుద్దిన్‌ను సంప్రదించగా రూ. 35,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

స్వాధీనం చేసుకున్న స్కానర్లు, పత్రాలు
డబ్బు తీసుకుని కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన శేఖర్ మే 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించగా ముఠా అక్రమాలు వెలుగుచూశాయి.

నిందితుల అరెస్ట్
హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌సత్తార్ 15 ఏళ్లు దుబాయిలో కంప్యూటర్ గ్రాఫిక్స్ వృత్తి నిర్వహించాడు.

నిందితుల అరెస్ట్
తిరిగి వచ్చిన సత్తార్ తనకున్న పరిజ్ఞానంతో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్హత పత్రాలు సృష్టించి వాటిద్వారా పాస్‌పోర్టులు ఇప్పించే పనిని ఎన్నుకున్నాడు. ఇందుకోసం అనేక ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకున్నాడు.












Click it and Unblock the Notifications