చెప్పకుండానే.. ప్రేమజంట ఆత్మహత్య(పిక్చర్స్)

సిద్దిపేట/హైదరాబాద్: పెద్దలు తమ ప్రేమకు అంగీకరిస్తారో? లేదో?నని భయంతో వారికి చెప్పకుండానే మెదక్ జిల్లా సిద్దిపేట గణేశ్‌నగర్‌కు చెందిన ప్రేమజంట తాళ్ల మాధవి (18), పనసి విజయ్ (21) ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని అల్వాల్ రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. సిద్దిపేటకు చెందిన ఉమారాణికి నలుగురు కుమార్తెలు. వీరి రెండవ కుమార్తె మాధవి ఇంటర్ ఫెయిల్ తర్వాత ఇంటివద్దనే ఉంటోంది. ఉమారాణి భర్త మృతి చెందారు. మాధవి గత నాలుగు నెలల క్రితం సిద్దిపేటలోని బాంబేక్లాత్ షోరూంలో వర్కర్‌గా పనిలో చేరింది. ఇదిలావుండగా, పనసి సత్యనారాయణ అనే వ్యక్తి హైదరాబాద్‌లో తాను చేస్తున్న మోటార్ ఫీల్డ్‌లో నష్టాలు రావడంతో సంవత్సరం క్రితమే సిద్దిపేటకు మకాం మార్చారు.

ఆయన కుమారుడు విజయ్‌కుమార్ ఇంటర్ వరకు చదివాడు. సిద్దిపేటకు వచ్చిన సత్యనారాయణ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా, మాధవి పని చేస్తున్న బాంబే క్లాత్ షోరూంలోనే విజయ్‌కుమార్ చేరాడు. విజయ్‌తో పాటు ఆతని సోదరుడు, వదిన సైతం ఇక్కడి షోరూంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్‌కుమార్, మాధవి ఒకే దగ్గరగా పనిచేస్తుండడంతో వారి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది.

మాధవి మంగళవారం తమ క్లాత్ షోరూం తరఫున హైదరాబాద్‌లోని చిల్కూరు బాలాజీ గుడికి వెళ్తున్నామని ఇంట్లో తమ తల్లి, సోదరిలకు చెప్పి వెళ్లింది. విజయ్‌కుమార్ కూడా హైదరాబాద్‌కు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లినట్లు తెలిపారు. అయితే, బుధవారం అల్వాల్ రైల్వే ట్రాక్ వద్ద మాధవి, విజయ్‌కుమార్ మృతి చెందినట్లు మీడియా ద్వారా సమాచారం అందడంతో ఆమె తల్లి పద్మారాణి, ఇతర కుటుంబసభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.

కాగా, మాధవి, విజయ్ ప్రేమించుకున్న విషయం తమకు తెలియదని విజయ్ సోదరుడు, వదిన తెలిపారు. మాధవి కూడా తమ ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేయలేదు. అయితే కులాలు వేరైన కారణంగా తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదోననే అనుమానంతో వీరిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారా? లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విషాదం

విషాదం

పెద్దలు తమ ప్రేమకు అంగీకరిస్తారో? లేదో?నని భయంతో వారికి చెప్పకుండానే మెదక్ జిల్లా సిద్దిపేట గణేశ్‌నగర్‌కు చెందిన ప్రేమజంట తాళ్ల మాధవి (18), పనసి విజయ్ (21) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య

హైదరాబాద్‌లోని అల్వాల్ రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య

వివరాల్లోకి వెళితే.. సిద్దిపేటకు చెందిన ఉమారాణికి నలుగురు కుమార్తెలు. వీరి రెండవ కుమార్తె మాధవి ఇంటర్ ఫెయిల్ తర్వాత ఇంటివద్దనే ఉంటోంది. ఉమారాణి భర్త మృతి చెందారు.

ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య

మాధవి గత నాలుగు నెలల క్రితం సిద్దిపేటలోని బాంబేక్లాత్ షోరూంలో వర్కర్‌గా పనిలో చేరింది.

ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య

ఇదిలావుండగా, పనసి సత్యనారాయణ అనే వ్యక్తి హైదరాబాద్‌లో తాను చేస్తున్న మోటార్ ఫీల్డ్‌లో నష్టాలు రావడంతో సంవత్సరం క్రితమే సిద్దిపేటకు మకాం మార్చారు.

మాధవి(ఫైల్ ఫొటో)

మాధవి(ఫైల్ ఫొటో)

సత్యనారాయణ కుమారుడు విజయ్‌కుమార్ ఇంటర్ వరకు చదివాడు. సిద్దిపేటకు వచ్చిన సత్యనారాయణ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా, మాధవి పని చేస్తున్న బాంబే క్లాత్ షోరూంలోనే విజయ్‌కుమార్ చేరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+