ఒకే స్పాట్‌లో రెండు షాకింగ్ ఇన్సిడెంట్‌లు, సిసి కెమెరాల్లో రికార్డ్
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఒకే స్పాట్‌లో రెండు షాకింగ్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. క్షణాల తేడాలో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకరు త్వరగా వెళ్లాలనే తాపత్రయంతో ప్రమాదానికి గురైతే, మరో ప్రమాదానికి రోడ్డు మీద ఉన్న రాయి కారణం. ఈ రెండు ఘటనలలో ఇద్దరు మహిళలు ప్రాణాలు దక్కించుకున్నారు.
కరీంనగర్ జిల్లాలో కోర్టు వైపు నుంచి ఓ థియేటర్ వైపు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి వచ్చిన బైకిస్ట్ ఓవర్ టేక్ చేయాలని వేగం పెంచి దాటే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి కుదుపు రావడంతో బైక్ వెనుక కూర్చున్న అమ్మాయి అదుపు తప్పి కిందపడింది.

అప్రమత్తమైన టిప్పర్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అయినప్పటికీ టిప్పర్ అమ్మాయి దగ్గరకు వచ్చింది. ఆమె గాయాలతో బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరీక్ష కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అదే ప్రాంతంలో క్షణాల తేడాలో మరో సంఘటన జరిగింది. ఓ వైపు టిప్పర్ ఘటన జరిగినప్పుడే కుడివైపున మరో ప్రమాదం జరిగింది. థియేటర్ నుంచి కోర్టు వైపు వెళ్తున్న ఓ బైక్.. రోడ్డు పక్కన ఉన్న రాయిపై ఎక్కడంతో కంట్రోల్ తప్పింది.
దీంతో వెనుక కూర్చున్న మహిళ పడిపోయింది. వెనుక నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ రెండు ప్రమాదాలు సమీపంలోని ఓ దుకాణంలో అమర్చిన సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.












Click it and Unblock the Notifications