చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్‌పల్లిలోని మైసమ్మచెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతిచెందారు. చెరువులో మృతదేహాలను గమనించిన స్థానికులు ఆదివారం కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు వెళ్లిన పోలీసులు మృతదేహాలను బయటకు తీయించారు.
బాలురు బోరబండలోని బంజారానగర్‌కు చెందిన సమీర్ (13), మొయినుద్దీన్ (14)గా గుర్తించి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. బాలురు హైటెక్‌సిటీ సమీపంలోని ఖానామెట్‌లో గల ఓ మదర్సాలో చదువుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ అనంతరం బయటికి వచ్చిన వారు కనిపించకుండా పోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు ఎస్‌ఆర్‌నగర్ ఔట్‌పోస్ట్‌లో ఫిర్యాదు చేశారు.
దుస్తులు విప్పేసి, స్లిప్పర్లు ఒడ్డున వదిలేసి, ఇద్దరు బాలురు కూడా స్నానానికి చెరువులోకి దిగినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం ఉదయం స్థానికులు వారి శవాలని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

చెరువులో మునిగి బాలురు మృతి
స్నానానికి వెళ్లి చెరువులో మునిగి చనిపోయిన ఇద్దరు బాలుర మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. సంఘటనా స్థలంలో ఇలా..

చెరువులో మునిగి బాలురు మృతి
ఇద్దరు బాలురు స్నానానికి వెళ్లి చెరువులో మునిగారు. వారిద్దరి మృతి వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

చెరువులో మునిగి బాలురు మృతి
దుస్తులు విప్పేసి, స్లిప్పర్లను ఒడ్డున వదిలేసి ఇద్దరు బాలురు కూడా స్నానానికి చెరువులోకి దిగి మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

చెరువులో మునిగి బాలురు మృతి
హైదరాబాదులోని కూకట్‌పల్లి మైసమ్మ చెరువులోకి ఇద్దరు బాలురు స్నానం కోసం దిగి అందులో మునిగి చనిపోయారు.












Click it and Unblock the Notifications