ఆస్ట్రేలియా బీచ్‌లో ఇద్దరు తెలంగాణ యువకులు మృతి
హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన తెలంగాణలో విషాదం నింపింది. దేశం కాని దేశంలో ఇద్దరు తెలంగాణ వాసులు చనిపోవడం విచారకరంగా మారింది. సోమవారం సాయంత్రం సరాదాగా బీచ్ కు వెళ్లిన ముగ్గురు యువకులు గౌసుద్దీన్, రాహత్, జునైద్ గల్లంతయ్యారు.

అయితే వారిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గౌసుద్దీన్, రాహత్ మృతదేహాలను వెలికి తీయించారు అక్కడి అధికారులు. అయితే కనిపించకుండా పోయిన జునైద్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాహత్ హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందినవారిగా తెలుస్తోంది. కాగా జునైద్, గౌసుద్దీన్ నల్గొండ జిల్లా వాసులని సమాచారం.












Click it and Unblock the Notifications