అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి
వనపర్తి: తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో విషాదం నెలకొంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. అమెరికా వెళ్లిన 17 రోజులకే కొడుకు మృతి చెందడంతో అతని ఇంట్లో తీరని శోకం మిగిలింది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన గట్టు వెంకన్నకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.
కుమారుడు దినేష్ ఎంఎస్ చదివేందుకు డిసెంబర్ 28న అమెరికా వెళ్లాడు. అమెరికాలోని హార్ట్‌ఫోర్డ్ రాష్ట్రంలో కనెక్టికట్‌లోని కాలేజీలో చదువుతున్నాడు. ఏమైందో తెలియదు కానీ.. శుక్రవారం రాత్రి తన రూంలో దినేష్ తోపాటు శ్రీకాకుళానికి చెందిన మరో విద్యార్థి కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నిద్రలోనే మృతి చెందడంపై వారి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దినేష్ తండ్రి వెంకన్న ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. దినేష్ తన కొడుకు పైచదువుల కోసం అమెరికా వెళుతున్నందున తాను అయ్యప్ప స్వామి దగ్గర పూజ చేయించి పంపారు. ఒక్కగానొక్క కొడుకు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి మృతి చెందడంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో యువకుడి మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications