తేల్చేసిన కిషన్ రెడ్డి - రేవంత్ వాట్ నెక్స్ట్..!!

తెలంగాణ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ తాజా గా ప్రధాని పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యల పైన రేవంత్ స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు సీఎం రేవంత్ ను టార్గెట్ చేసారు. రాహుల్ గాంధీ కులం గురించి ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాను నిలదీస్తు న్నారు. తాజాగా కిషన్ రెడ్డి బయ్యారం స్టీల్ ప్లాంట్ పైన స్పష్టత ఇచ్చారు. మరి.. ఇప్పుడు సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారు.

ఆయనది ఏ కులం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. రాహుల్ గాంధీ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి ఆయన కులం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలతోనే పబ్బం గడుపుతున్నారని విమర్శిం చారు. ప్రస్తుతం రాష్ట్రంలో దయనీయ పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. కులగణనకు బీజేపీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. 42శాతం రిజర్వేషన్లపై మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులసంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత తమ నిర్ణయం చెబుతామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Union Minister Kishan Reddy clarifies over Bayyaram Steel plant iron and Targets CM Revanth

బయ్యారం పై క్లారిటీ
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. బయ్యారం ఐరన్ ఓర్‌లో క్వాలిటీ లేదని చెప్పారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరిపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. రేవంత్ ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిప డ్డారు. వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల దగ్గర హాజరు వేయించు కుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి మోదీపై ఇష్టం వచ్చినట్లుగా రేవంత్‌ మాట్లాడితే.. చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ తో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలు మరచిపోరని కిషన్‌రెడ్డి చెప్పారు.

ప్రభుత్వం పై వ్యతిరేకత
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని కిషన్ రెడ్డి చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇలాగే వ్యతిరేకత వచ్చిందని.. అందుకే కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. అన్నివర్గాల ప్రజలు కాంగ్రె స్‌కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పదేళ్లు పట్టింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే వ్యతిరేకత మూటగట్టుకుందని చెప్పుకొచ్చారు. నాడు ప్రతిపక్షమే ఉండకూడదని కేసీఆర్ భావించారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగలేని పరిస్థితి రాబోతోందని కిషన్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+