• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉప్ప‌ల్ సీటు మేయ‌ర్ కే..! కేసీఆర్ నిర్ణ‌యానికి కేటీఆర్ చెక్..!!

|
  ఉప్ప‌ల్ సీటు మేయ‌ర్ కే అంటున్న కేటీఆర్...!

  హైద‌రాబాద్: న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప‌రిస్థితి విచిత్రంగా త‌యారయ్యింది. బ‌య‌ట పార్టీ పోరు ఇంట్లో ఇల్లాలి పోరు అన్న‌ట్టు త‌యార‌య్యింది ఆయ‌న ప‌రిస్థితి. బొంతు రామ్మోహ‌న్ భార్య శ్రీ‌దేవికి ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టుంది. అంతే కాకుండా గ‌త రెండేళ్లుగా స్థానిక ప్ర‌జానికానికి అందుబాటులో ఉంటూ అన్ని స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రిస్తోంది శ్రీ‌దేవి. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎప్ప‌టినుంచో ఆవిడ ఆశ‌లు పెట్టుకున్నారు. అంతే కాకుంగా ఫేస్ బుక్ లో ఎమ్మెల్యే శ్రీ‌దేవి పేరిట ఎకౌంట్ కూడా ఓపెన్ చేసి వేల సంఖ్య‌లో మెంబ‌ర్ల‌ను జాయిన్ చేసారు ఆవిడ అనుచ‌రులు.

  మేయ‌ర్ దంప‌తుల‌కు కేసీఆర్ చెక్..! స‌ర్థిచెపుతున్న కేటీఆర్..!!

  మేయ‌ర్ దంప‌తుల‌కు కేసీఆర్ చెక్..! స‌ర్థిచెపుతున్న కేటీఆర్..!!

  ఇంత‌లో ఉప్ప‌ల్ సీటును బొంతు భార్య‌కు కాకుండా వేరే అభ్య‌ర్థికి కేటాయించ‌డంతో అయొమ‌యానికి గుర‌య్యారు మేయ‌ర్ దంప‌తులు. ఈ నేప‌థ్యంలోనే అలక‌బూనిన బొంతుకు మంత్రి కేటీఆర్ స‌ర్థిచెప్పిన‌ట్టు తెలుస్థోంది. బొంతు భ‌విశ్య‌త్తుకు కేటీఆర్ మంచి భ‌రోసా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగాంగానే ఉప్ప‌ల్ సీటులో మార్పులు జ‌రిగే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి. చివ‌రి నిమిషంలో శేఖ‌ర్ రెడ్డిని కాద‌ని బొంతు కు బీఫామ్ ఇచ్చినా ఆశ్య‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్న బొంతు రామ్మోహ‌న్ ప్ర‌స్థానం ప‌ద‌వుల విష‌యానికి వ‌చ్చే స‌రికి కుదుపుల‌కు లోనౌతూ వ‌స్తోంది.

  ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్న బొంతుకు ప‌ద‌వుల విషయంలో మాత్రం మొండిచేయి..!

  ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్న బొంతుకు ప‌ద‌వుల విషయంలో మాత్రం మొండిచేయి..!

  2014లో ఎమ్మెల్యే సీటును ఇస్తాన‌న్న చంద్ర‌శేఖ‌ర్ రావు చివ‌రి నిమిషంలో చేయిచ్చారు. ఆ త‌ర్వాత జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కార్పోరేట‌ర్ గా పోటీ చేయ‌మ‌న్న బొంతుకు మేయ‌ర్ ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తామ‌ని హామీ మాత్రం ఇవ్వ‌లేదు. ఈ విష‌యంలో కూడా బొంతు చిన్న పాటి యుద్దం చేయాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత మేయ‌ర్ ప‌దవి ఇస్తాన‌ని కేసీఆర్ తో మాట తీసుకున్న త‌ర్వాతే కార్పోరేట‌ర్ గా పోటీ చేసారు బొంతు. తాజాగా మ‌రోసారి బొంతు రామ్మోహ‌న్ కు చంద్ర‌శేఖ‌ర్ రావు మొండి చేయి చూప‌డంతో తీవ్ర అసంత్రుప్తి వ్య‌క్తం చేసారు బొంతు రామ్మోహ‌న్. కేటీఆర్ హామీతో ప‌ట్టు వీడిన‌ట్టు తెల‌స్తోంది.

  కేసీఆర్ జాబితాకు కేటీఆర్ తుదిమెరుగులు దిద్దుతారా..! గులాబీ శ్రేణుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..!

  కేసీఆర్ జాబితాకు కేటీఆర్ తుదిమెరుగులు దిద్దుతారా..! గులాబీ శ్రేణుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..!

  తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్ర‌శేఖ‌ర్ రావు ఒక్కసారే 105 మంది టిక్కెట్లు ప్రకటించటం వెనక రాజకీయ వ్యూహాం కంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే టీఆర్ఎస్ వర్గాల నుండి అవుననే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తనకంటూ ప్రత్యేకంగా ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకునేందుకు ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ తనయుడు కెటీఆర్ ప్రయత్నాలు చేశారంటున్నారు. ఎన్నికల వేళ పార్టీలో ఇది పెద్ద దుమారానికి కారణం అయ్యే అవకాశం ఉందని గ్రహించిన కెసీఆర్ దీనికి ఆదిలోనే అడ్డుకట్ట వేయటానికి ఈ స్కెచ్ వేశారని చెబుతున్నారు.

  కొంగరకలాన్ సభ సమయంలోనే టిక్కెట్ల కేటాయింపు అంశంపై కెసీఆర్, కెటీఆర్ ల మధ్య విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాల్లో బాగా ప్రచారం జరిగింది. సర్వే నివేదికలు ప్రతికూలంగా ఉన్న చాలా మంది సిట్టింగ్ లకు సీట్లు ఖరారు చేయటం వెనకే ఇదే కారణం అని చెబుతున్నారు.

  ఉప్ప‌ల్ సీటుపై ఉత్కంఠ‌..! అభ్య‌ర్ధి మారే అవ‌కాశం..!!

  ఉప్ప‌ల్ సీటుపై ఉత్కంఠ‌..! అభ్య‌ర్ధి మారే అవ‌కాశం..!!

  బొంతు రామ్మోహన్ అండగా కెటీఆర్ ఉన్నారని త్వరలోనే ఉప్పల్ టిక్కెట్ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంటే కెసీఆర్ ప్రకటించిన టిక్కెట్ ను కెటీఆర్ మార్పిస్తారా చూడాలి. సహజంగా టీఆర్ఎస్ అధినేత తీరు తెలిసిన వారెవరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తితే ఇక అంతే సంగ‌తులు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నోజ‌రిగాయి కూడా. కానీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తనకు ఉప్పల్ టిక్కెట్ కేటాయించలేదని అలక వహించి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఆయన అనుచరులు సమావేశాలు నిర్వహించారు.బొంతు రామ్మోహన్ కొన్ని రోజులు బెంగుళూరులో మకాం వేసి వచ్చారు. సహజంగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసే వారిని కెసీఆర్ కానీ, కెటీఆర్ ఏ మాత్రం దగ్గరకు రానివ్వరు. కానీ అందుకు భిన్నంగా టిక్కెట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలసి మంత్రి కెటీఆర్ ఎంపీ మల్లారెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనటం విశేషం.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  dissatisfaction leaders in telangana raising their voice against kcr. the leaders, mlas devided into 2,3 groups and demanding to recognise true telengana fighters and allotment of mla seats. mayor bonthu ram mohan was in deep agony in uppal seat. he expected the uppal seat long back from kcr, now kcr deny his promise.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more