ఇది సరికాదు!: టీఎస్‌పీఎస్‌సిపై ఉర్దూ అభ్యర్థుల గుర్రు, స్పెషల్ కమిటీకి డిమాండ్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎస్జీటీ పోస్టుల భర్తీకై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఉర్దూ టీచర్ పోస్టులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సమగ్ర వివరాలు సేకరించకుండానే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియకు పూనుకున్నారని ఉర్దూ మీడియం అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

ఎదురుచూపులకు మట్టికొట్టినట్టే?: ఆ దెబ్బతో ఎస్జీటీ అభ్యర్థుల విలవిల.. అప్పుడే ఓ ప్రాణం బలి!

  KCR orders change for teachers’ recruitment in Telangana - Oneindia Telugu

  రాష్ట్రవ్యాప్తంగా 1400మంది వాలంటరీ టీచర్లు ఉర్దూ మీడియంలో పనిచేస్తున్నప్పుడు.. కేవలం 636పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నట్టే నోటిఫికేషన్ లో పేర్కొనడం ఎంతవరకు సమంజసం అని అఖిలభారత ఆదర్శ టీచర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఖలీద్ హుస్సేన్ ప్రశ్నించారు.

  Urdu teachers flay Telangana government over jobs

  గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1800 ఉర్దూ టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో 636ఉర్దూ టీచర్ పోస్టులు ఉండగా, అందులో 279పోస్టులు ఎస్సీ/ఎస్టీ, బీసీలకే రిజర్వ్ అయి ఉంటాయని మజ్లిస్ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మొయినుద్దీన్ గుర్తుచేశారు.

  తెలంగాణ టీచర్ అసోసియేషన్ ఫరూఖ్ మాట్లాడుతూ.. ఆయా స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే రాష్ట్రంలో విద్యా వాలంటీర్లను భర్తీ చేశారని అన్నారు.

  ఉర్దూ టీచర్ల నియామకంలో ఖాళీల సంఖ్యపై అభ్యంతరాలను లేవనెత్తుతూ కొంతమంది టీచర్ల బృందం ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని కలిశారు. ఉర్దూ టీచర్ల నియామక ప్రక్రియ కోసం స్పెషల్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అక్బరుద్దీన్ హామి ఇచ్చారు.

  డిప్యూటీ సీఎం మహమూద్ అలీ దీనిపై స్పందించారు. ప్రభుత్వం పోస్టుల భర్తీ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని గుర్తుచేశారు. నోటిఫికేషన్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదని, ఒకవేళ ఏవైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామని అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Urdu medium teachers across the state are crying foul over the recently issued notification by the Telangana State Public Service Commission (TSPSC) to fill up the vacancies of SGT in various government schools in the state

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి