నీవల్లే: కిరణ్ బుక్‌పై వీహెచ్, నిజాంకి కేసీఆర్ పిలుపు
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంత రావు ఆదివారం మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ కిరణ్ రెడ్డి పుస్తకం రాస్తున్నారని వార్తలు రావడంతో ఆయన స్పందించారు.
2010లో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పోషించిన పాత్రను చరిత్ర ఎన్నటికీ మరిచిపోదని దుయ్యబట్టారు. కిరణ్ కుమార్ రెడ్డికి వీహెచ్ ఓ లేఖ కూడా రాశారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని చేసినందుకు ప్రతిఫలంగా పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. స్వార్థపూరిత రాజకీయాల కోసం పార్టీని ఆయన వాడుకున్నారన్నారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రండి

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ 8వ నిజాంను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాగా జూన్ 1నుంచి 7వరకు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.
అసఫ్ జాహీ పాలకుల వారసుడైన ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీఖాన్ ముకరంజా బహద్దూర్‌ను అవతరణ వేడుకలకు ఆహ్వానించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆహ్వాన లేఖ పంపించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాద్‌లో గత వైభవం కోసం అనేక ప్రణాళికలు రూపొందించారని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు రూపొందించారని మీర్ బర్కత్ అలీఖాన్‌కు లేఖ రాశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications