భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం: ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోండి

ఖమ్మం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో డిసెంబర్ 23న భక్తులకు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. బుధవారం నుంచి ఉత్తర ద్వార దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈవో ప్రకటనలో పేర్కొన్నారు.

భద్రాద్రి ఆలయ వెబ్‌సైట్‌లో టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు ఈవో తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం రూ. 2000, రూ. 1000, రూ. 500, రూ. 250 విలువైన సెక్టార్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ప్రత్యక్షంగా ఉత్తర ద్వార దర్శనానికి రాలేని భక్తులు.. పరోక్ష సేవల కోసం https://bhadradritemple.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా రూ. 2000, రూ. 1000 టికెట్లను 22న ఉదయం 11 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చన్నారు.

vaikunta ekadasi uttara dwara darshanam in bhadrachalam temple; ticket bookings open

ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులు డిసెంబర్ 13, 2023 ఉదయం 11 గంటల నుంచి డిసెంబర్ 23, 2023 ఉదయం 5 గంటల వరకు దేవస్థాన తానీషా కళ్యాణ మండపం కార్యాలయంలో ఒరిజినల్ టికెట్లు పొందవచ్చని ఈవో రమాదేవి తెలిపారు.

భద్రాద్రి రాములవారిని దర్శించుకున్న తుమ్మల, పొంగులేటి

భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాములను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ కో-కన్వీనర్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీలక్ష్మీతాయారమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందించి తీర్ధప్రసాదాలు అందజేశారు. శ్రీ రాముడి అనుగ్రహంతో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన పుణ్యక్షేత్రం భద్రాచల పుణ్యక్షేత్రాన్ని త్వరలోనే అభివృద్ధి చేస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+