తెలుగు రాష్ట్రాలకు రెండు వందే మెట్రో - రూట్లు ఖరారు..!!
తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేభారత్ మెట్రో రైళ్లు రానున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న ఇంటర్ సిటీ స్థానంలో వందేమెట్రో నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో తొలి వందేమెట్రో సర్వీసు ప్రారంభం అవుతోంది. అహ్మదాబాద్ - భుజ్ మధ్య ప్రారంభిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేమెట్రో నడిపే రూట్లను అధికారికంగా ఖరారు చేసారు.
రెండు వందేమెట్రో
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ బాగుంది. దీంతో..కొత్తగా మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు. విశాఖ - దుర్గ్ మధ్య వందేభారత్ నేడు అందుబాటులోకి రానుంది. ఈ నెల 19వ తేదీ నుంచి సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య మరో వందేభారత్ సర్వీసు ప్రారంభం కానుంది. ఇక..నేటి నుంచి ప్రారంభం అవుతున్న వందేమెట్రో రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి వందే మెట్రో రైలును తిరుపతితో అనుసంధానం చేయనున్నారు.

ఇంటర్ సిటీ స్థానంలో
చెన్నై- తిరుపతి మధ్య తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేమెట్రోగా పట్టాలెక్కనుంది. తదుపరి జాబితాలో వరంగల్ మీదుగా సికింద్రాబాద్ - విజయవాడ మధ్య కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ రూటులో నడుస్తున్న ఇంటర్ సిటీ స్థానంలో అదే సమయంలో ఈ రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీంతో..తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ సేవలు మరింత పెరగనున్నాయి.100 నుంచి 350 కిలో మీటర్ల దూరం ఉండే రెండు ప్రధాన నగరాల మధ్య నడిచేలా ఈ రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ఠ వేగం 110 కిలో మీటర్లుగా ఉంటుంది.
రెండు మార్గాలు ఖరారు
ఇవి పూర్తి ఏసీ రైళ్లు. భవిష్యత్తులో నాన్ ఏసీ రైళ్లను కూడ నడపనున్నారు. ఈ రైళ్లల్లో కనీస ఛార్జీ రూ 30 కాగా, దూరాన్ని బట్టి గరిస్ఠ ఛార్జీ (350 కిలో మీటర్లు) రూ 445గా నిర్ణయించారు. ఈ రైళ్లల్లో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, ప్రయాణికులను అనువైన సీటింగ్ ఉంటుంది.ఈ రైలులో నాలుగేసి బోగీలు ఓ యూనిట్ గా ఉండగా.. ఒక రైలులో కనీసం 12 బోగీలు ఉంటాయి. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా బోగీలను 16కు పెంచే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ తరహాలో వందేమెట్రో కు సైతం ఆదరణ వస్తుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications