వేముల రోహిత్ ఇష్యూ: న్యాయం చేయాలని.. హెచ్‌సియులో తీవ్ర ఉద్రిక్తత
రోహిత్ వేములకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, ఆయనకు న్యాయం జరగాలని పలువురు విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ర్యాలీ తీశారు.
హైదరాబాద్: రోహిత్ వేములకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, ఆయనకు న్యాయం జరగాలని పలువురు విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ మంగళవారం నాడు ఉద్రిక్తతకు దారి తీసింది.

జై భీమ్, జై అంబేడ్కర్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. రోహిత్ వేములకు న్యాయం జరగలేదని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ చిత్రపటాలు ప్రదర్శించారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు.. విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడాతూ.. కొందరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. రోహిత్ వేముల తల్లి రాధికను కూడా అదుపులోకి తీసుకున్నారన్నారు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రోహిత్ వేముల నివాళి సభ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications