సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్ పై వేణుస్వామి షాకింగ్ వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఫైర్!
సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న వేణు స్వామి తాజాగా మరో మారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో నాగచైతన్య, సమంత విడిపోతారని జాతకం చెప్పిన వేణు స్వామి ఆ తర్వాత నాగచైతన్య, శోభిత గురించి దారుణమైన కామెంట్స్ చేశారు. అప్పుడు వేణు స్వామి పైన ఫిర్యాదు చేయడం మహిళా కమిషన్ కూడా వేణు స్వామిని ఈ విషయంలో విచారించడం వంటి ఘటనలతో రచ్చ జరిగింది.
వేణు స్వామి ఆడియో వైరల్
ఆ తర్వాత ఎప్పుడూ ఎవరి జాతకాలు చెప్పనంటూ వేణు స్వామి ఒక వీడియోను విడుదల చేశారు. అయినప్పటికీ ఆ తర్వాత కూడా వేణు స్వామి తనదైన శైలిలో జాతకాలు చెబుతూనే ఉన్నారు. ఇక ఇటీవల తాజాగా వేణు స్వామి చెప్పిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేణు స్వామి ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు సెలబ్రిటీల ఆత్మహత్య చేసుకుంటారని చెప్పిన ఆడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.

సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్ పై షాకింగ్ వ్యాఖ్యలు
ఒక జర్నలిస్టుతో ఆయన మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఆడియోలో వేణుస్వామి సమంత రుతు ప్రభు, విజయ్ దేవరకొండ ల ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవడం ఖాయమని పేర్కొన్నారు. ఇక ఒక హీరోకి సీరియస్ ఇంజ్యూరీ ఉంటుందని చెప్పడంతో పాటు వేణుస్వామి ఆ హీరోకి అన్ని సమస్యలే ఉన్నాయని, అందుకే రాజాసాబ్ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారని మాట్లాడారు.
వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్యాన్స్ సీరియస్
అయితే ప్రభాస్ కా అంటూ అడిగే ప్రయత్నం చేస్తే తర్వాత మాట్లాడుకుందాం అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ప్రభాస్ గురించి, విజయ్ దేవరకొండ గురించి, సమంత గురించి, వేణు స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇది గతంలో మాట్లాడిన ఆడియోనా, లేకపోతే రీసెంట్ గా మాట్లాడిందా అనేది తెలియడం లేదు కానీ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపైన ఫాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు.
ఎవరైనా సూసైడ్ చేసుకుంటారని మాట్లాడతారా?
ఎక్కడైనా చనిపోతారని, ఆత్మహత్య చేసుకుంటారని ఎవరైనా మాట్లాడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం మళ్లీ ఈ తరహా వివాదాలు మొదలుపెట్టాడని మండిపడుతున్నారు. ఇకనైనా ఇటువంటివి మానుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వేణు స్వామిని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications