మళ్ళీ విజయం మనదే.. గులాబీ బాస్ కేసీఆర్ కాన్ఫిడెన్స్ అదేనా!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయఢంకా మోగిస్తోంది. తెలంగాణ భవన్లో జరిగిన విస్తృతస్థాయి భేటీలో బల్లగుద్ది మరీ చెప్పారు. 95 నుంచి 105 సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మరోమారు బీఆర్ఎస్ పాగా వేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ హడావిడిగా ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో చేసిన వ్యాఖ్యల మతలబు ఏమిటి? ఆయన ధీమాకు కారణమేమిటి? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. బీజేపీకి ఊహించని దెబ్బ కొట్టింది.

దీంతో తెలంగాణ రాష్ట్రంలో దూకుడు మీద ఉన్న బిజెపిని కర్ణాటక ఎన్నికల ఫలితం కాస్త నిరాశకు గురి చేసింది. ఇక తెలంగాణలో అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు వచ్చినట్లయింది. వచ్చే ఎన్నికలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఈ పరిణామమే కెసిఆర్ మళ్లీ తామే గెలిచే అవకాశం ఉందని చెప్పడానికి కారణంగా భావిస్తున్నారు రాజకీయ వర్గాల నాయకులు.
బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు పోటాపోటీగా ఓటుబ్యాంకు చీలగొడితే మళ్లీ కచ్చితంగా గెలిచేది బిఆర్ఎస్ పార్టీనేనని కెసిఆర్ బాగా ధీమాతో ఉన్నారు. తెలంగాణాలో బీజేపీ బలపడుతుందని భావించిన సీఎం కేసీఆర్ కు, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ తెలంగాణలో బలపడే అవకాశం ఉన్నదన్నది అంచనా. ఒకవేళ అదే కనుక జరిగితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్లచీలిక కచ్చితంగా జరుగుతుందని, అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉంటాయని భావిస్తున్నారు.

ఈ విశ్వాసంతోనే కేసీఆర్ నిన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని కూడా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మొత్తానికి కెసిఆర్ ఊహించినట్టు జరుగుతుందా? లేక కెసిఆర్ అంచనాలను తారుమారు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వస్తాయా? అన్నది మరి కొద్ది నెలల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications