సురేఖ స్థానంలో కేబినెట్ లోకి రాములమ్మ, ఢిల్లీ డెసిషన్ - అక్కడే అసలు ట్విస్ట్..!!

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. కొండా సురేఖ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ తరువాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పార్టీ నాయకత్వం సురేఖ పైన చర్యల ద్వారా తమ వైఖరి ఏంటో స్పష్టం చేసింది. సురేఖ స్థానంలో మంత్రిగా మహిళకే అవకాశం ఇవ్వాలి అని హైకమాండ్ నిర్దేశించింది. దీంతో.. రాములమ్మ పేరు దాదాపు ఖాయమైంది. అయితే, అక్కడ అసలు రాజకీయం మొదలైంది. దీంతో.. తదుపరి నిర్ణయాల పై ఉత్కంఠ కొనసాగుతోంది.

కొండా సురేఖ పై వేటుతో అధికార కాంగ్రెస్ లో రాజకీయం మారుతోంది. కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే హైకమాండ్ కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఢిల్లీలో సుదీర్ఘ కసరత్తు తరువాత సురేఖ పైన వేటు వేస్తూనే.. ఒకే సారి ముగ్గురు మహిళలకు పదవులు కట్టబెట్టారు. కాగా, ఇక.. తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయి. త్వరలోనే మంత్రివర్గం ప్రక్షాళన ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. సురేఖ స్థానంలో ఎమ్మెల్సీ విజయ శాంతి పేరు ఖాయమైనట్లు సమాచారం. ఆమెకి మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ బలోపేతానికి వాడుకోవాలని రాష్ట్ర నాయకత్వాని కి సూచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే కొండా సురేఖ ఫైర్ పార్టీని వీడి రేపటి రోజున కాంగ్రెస్ మీద నిప్పులు చెరగడం ఖాయమని.. ఆమెను ఢీ కొట్టేందుకు విజయశాంతికి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 సూపర్ ఫాస్ట్ గా 'శబరి', టైమింగ్స్ మార్పు - ఆ ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇక.!!
సూపర్ ఫాస్ట్ గా 'శబరి', టైమింగ్స్ మార్పు - ఆ ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇక.!!
Vijayashanti May Get Cabinet Chance After Konda Surekha s Removal as party sources here the equations

కేబినెట్ లో మార్పులు.. చేర్పులు

అయితే.. ఇటు సీఎం రేవంత్ మాత్రం తన మార్క్ లెక్కలతో సిద్దం అవుతున్నారు. కేబినెట్ లోకి విప్ ఆది శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. మహిళతో భర్తీ చేయాలంటే కేకే కుమార్తె విజయ లక్ష్మి పేరు వైపు మొగ్గు చూపుతున్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది. అదే విధంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకొని.. ప్రస్తుత కేబినెట్ లో బీసీ మంత్రికి టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నారు. అదే విధంగా స్పీకర్ ప్రసాద కుమార్ ను సైతం కేబినెట్ లోకి తీసుకుంటారని.. ఆయన స్థానంలో ఉమ్మడి కరీంనగర్ ఎస్సీ వర్గానికి చెందిన మంత్రిని స్పీకర్ గా చేస్తారని ప్రచారం సాగుతోంది.

గ్రేటర్ ఎన్నికల వేళ హైదరాబాద్ పరిధిలోని నేతకు అవకాశం ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. దీంతో.. అసెంబ్లీ సమావేశాల తరువాత మరోసారి సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి కేబినెట్ కు తుది రూపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్న వారిలో మరో సారి ఉత్కంఠ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+