సూపర్ ఫాస్ట్ గా 'శబరి', టైమింగ్స్ మార్పు - ఆ ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇక.!!
రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ - తిరువనంతపురం - సికింద్రా బాద్ మధ్య నడిచే శబరి ఎక్స్ ప్రెస్ పైన కీలక ప్రకటన చేసారు. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్య లో వినియోగించుకునే ఈ రైలుకు.. నిత్యం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడ ఈ రైలు నిర్వహణ తో పాటుగా ప్రయాణ వేళలు మార్పు చేసారు. అదే విధంగా ప్రయాణీకుల డిమాండ్ ఉన్న ఎనిమిది ప్రధాన రైళ్ల పైన రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
శబరి నెంబర్, వేళలు
సికింద్రాబాద్ - తిరువనంతపురం - సికింద్రాబాద్ (17229/17230) శబరి ఎక్స్ ప్రెస్ ను ఇక నుంచి సూపర్ ఫాస్ట్ గా మార్పు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలుకు అయ్యప్పల సీజన్ లో భారీ డిమాండ్ ఉంటుంది. ఇతర సమయాల్లోనూ రద్దీ కొనసాగుతోంది. ఈ రైలుకు ఉన్న డిమాండ్ తో రైల్వే శాఖ శబరి ఎక్స్ ప్రెస్ ను ఇక నుంచి సూపర్ ఫాస్ట్ గా మారుస్తూ తాజాగా రైల్వో బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ రైలుకు కొత్త నెంబర్లు (20630/20629) కేటాయించారు. అదే విధంగా ప్రయాణ వేళలు మార్పు చేసారు. తిరువనంత పురం 6.45 గంటలకు బయల్దేరే ఈ రైలు సికింద్రాబాద్ కు మరుసటి రోజు 11 గంటలకే రానుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సికింద్రా బాద్ లో 14.35 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 18.20 గంటలకు తిరువనంత పురం చేరుకుంటుంది.

ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో
కాగా, ఈ ఉత్తర్వులు అమలు పైన స్థానిక రైల్వే అధికారులు ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతం ఈ రైలు సికింద్రాబాద్ లో 12.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు 18.05 గంటలకు తిరువ నంతపురం చేరుకుంటుంది. ఇక.. ఎనిమిది ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు ఏసీ బోగీలను అందుబాటులోకి తెస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి లోని ముఖ్యమైన ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లను అదనపు ఏసీ బోగీలను ఏర్పాటు చేసారు. ప్రయాణీకు ల రద్దీకి అనుగుణంగా ప్రతీ రైలుకు ఒక త్రీ టైర్ ఏసీ ఎకానమీ బోగీని శాశ్వత ప్రాతిపదికన ఏర్పా టు చేయాలని నిర్ణయించారు.
13 నుంచి అమలు
సికింద్రాబాద్ - సిర్పూరు కాగజ్ నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ (172033/17234) రైలు, సికింద్రాబాద్ - గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ ప్రెస్ (17201/17202), కాచిగూడ - విజయవాడ మద్య నడిచే శాతవాహన (12713/12714), విజయవాడ - చెన్నై మధ్య నడిచే పినాకినీ ఎక్స్ ప్రెస్ (12711/12712) రైళ్లకు అదనపు ఏసీ బోగీ సదుపాయం ఈ నెల 13 నుంచి అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications