నేడు కృష్ణాష్టమి నాడు సంపదలతో తులతూగే రాశులు ఇవే.. మీ రాశి ఉందా?

నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. కృష్ణ భగవానుడు జన్మించిన అత్యంత శుభకరమైన రోజు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4 శుక్రవారం 12 రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక అంశాల్లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో జ్యోతిష్యం ఆధారంగా తెలుసుకుందాం.

నేడు కృష్ణాష్టమి.. గ్రహాల సంచారం ఇలా

ఈ రోజు వృషభ రాశిలో చంద్రుడు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో గురుడు సంచారం చేస్తున్నారు. సింహంలో కేతు-సూర్య-బుధ సంయోగంతో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. తులలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తున్నారు. ఈ గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేసినా, కృష్ణయ్య దయతో నేడు ఎవరికీ ఎలాంటి ఫలితం రాబోతుందో తెలుసుకుందాం.

today rashiphalalu Horoscope for 4 September Krishna Janmashtami Special for All 12 Zodiac Signs

మేషం: మేషరాశి జాతకులకు కృష్ణుని అనుగ్రహంతో పనులు సులభంగా పూర్తవుతాయి.ఈ సమయంలో వీరికి లాభాలు కనిపిస్తాయి. కష్ట పరిస్థితులను సులభంగా అధిగమిస్తారు.
వృషభం: వృషభ రాశి జాతకులకు చంద్రుని ప్రభావంతో పనులు వేగంగా జరుగుతాయి. నైపుణ్యాలు ప్రదర్శించి ఉన్నత స్థానం సాధించే అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం: మహాలక్ష్మీ అనుగ్రహంతో మిధున రాశి వారికి అనేక వైపుల నుంచి డబ్బు వస్తుంది. కష్టపడ్డ ఫలితం దక్కుతుంది. అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది .
కర్కాటకం: గురుడి ప్రభావంతో నేడు కర్కాటక రాశి జాతకుల ఆదాయం పెరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు మానకండి. ఇది కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది.

సింహం: సింహరాశి జాతకులకు నేడు కృష్ణుడి కరుణతో లాభ మార్గాలు తెరుచుకుంటాయి. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది.
కన్య: కన్యా రాశి జాతకులకు కష్టపడితే యశస్సు ఖాయంగా కనిపిస్తుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
తుల: శుక్రుని ప్రభావంతో తులారాశి జాతకుల సంబంధాలు బలపడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

వృశ్చికం: వృశ్చిక రాశి జాతకుల ఉద్యోగ అవకాశాలు మెరుస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
ధనుస్సు: ధనుస్సు రాశి జాతకుల పనులు నేడు సులభంగా పూర్తవుతాయి. ఉన్నత స్థానం దక్కుతుంది. అధిక జీతం పొందే అవకాశం ఉంది.
మకరం: మకర రాశి జాతకుల వ్యాపారులకు అనుకూలంగా ఉండే రోజు ఈ రోజు. ఆర్థిక నిర్ణయాల్లో మకర రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి.

నేడు త్రిగ్రాహి యోగంతో ఈ రాశులవారికి దశ మారిపోతుంది.. మీ రాశి ఉందా?
నేడు త్రిగ్రాహి యోగంతో ఈ రాశులవారికి దశ మారిపోతుంది.. మీ రాశి ఉందా?

కుంభం: కుంభరాశి జాతకులకు నేడు పని భారం తగ్గుతుంది. కుంభరాశి వారు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త వహించండి.
మీనం: మీనరాశి జాతకులకు నేడు ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. వీరు చేసే ఉమ్మడి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు జన్మాష్టమి ప్రభావంతో చాలా రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు దక్కుతాయి.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+