ఈ మార్గంలో రైళ్ల రాకపోకల పునరుద్దరణ..!!
తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా వరంగల్ జల్లాలోని మహబూబాబాద్ వద్ద గల ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు పునరుద్దరణ పనులు పూర్తి చేసారు. ఇప్పటికే ట్రయిల్ రన్ జరిగింది. ఈ సాయంత్రం నుంచి తిరిగి ఈ మార్గంలో రైళ్లను పునరుద్దరించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రద్దు చేసిన రైళ్లను తిరిగి ప్రారంభించనున్నారు.
ట్రాక్ పనులు పూర్తి
విజయవాడ-హైదరాబాద్ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు పూర్తయ్యాయి. తొలుత గుంటూరు నుంచి హైదరాబాద్‌కు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే అధికారులు పంపించారు. మిగిలిన రైళ్లను సాయంత్రం లోపు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ సాయంత్రం బయల్దేరనుంది.

రైళ్ల పునరుద్దరణ
ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు అధికారులు నిర్ధారించారు. అప్‌లైన్ మార్గంలో రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాయి. డౌన్‌లైన్‌లో అర్ధరాత్రి కల్లా పనులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. వరదల వల్ల మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వేట్రాక్ ను 52 గంటల్లో అధికారులు పునరుద్దరించారు. ఈ ట్రాక్ రిపేర్ కారణంగా వరంగల్ - విజయవాడ ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ట్రాక్ ను పునరుద్ధరించడంతో నేటి నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
రాకపోకలు మొదలు
వరంగల్ మీదుగా ఢిల్లీకి రైళ్ల రాకపోకలు సాగనున్నాయి. అయితే కొత్త ట్రాక్ కనుక ఈ ట్రాక్ పై రైళ్లు నెమ్మదిగా వెళ్లాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు. ఈ ట్రాక్ పైన మరమ్మత్తుల కారణంగా ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చే పలు రైళ్లను దారి మళ్లించారు. విజయవాడ - గుంటూరు మీదుగా రైళ్లను కొనసాగించారు. పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసారు. అయిదు రోజులుగా పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపుతో ఇబ్బందులు పడిన ప్రయాణీకులకు తిరిగి ఈ లైన్ లో రాకపోకలకు లైన్ క్లియర్ కావటంతో యధావిధంగా రైళ్లు కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications