కాంగ్రెస్ లో చేరిక, పోటీ చేసే స్థానంపై తేల్చేసిన వివేక్..!!
తెలంగాణలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. బీజేపీలో కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసారు. ఈ నెల 27న కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సైతం కాంగ్రెస్ కి తిరిగి రానున్నారని ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారం పైన వివేక్ స్పందించారు. తాను పార్టీ మారే అంశంతో పాటుగా తన పోటీ చేసే స్థానం పైన వివేక్ ..తేల్చి చెప్పారు.
తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రెండో జాబితా ప్రకటనకు ముందు సీనయిర్లను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. రేవంత్ టీపీసీసీ చీఫ్ అయిన తరువాత పార్టీ వీడిన వారిని తిరిగి సొంత గూటికి వచ్చేలా కసరత్తు చేస్తోంది. అందులో తొలి విజయం సాధించింది. బీజేపీలో చేరి మునుగోడు నుంచి పోటీ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసారు.

తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరటం తో పాటుగా ఆ పార్టీ అభ్యర్దిగా మునుగోడు నుంచి పోటీకి సిద్దమయ్యారు. సీటు పైన కాంగ్రెస్ నుంచి హామీ పొందారు. దీంతో, రాజగోపాల్ రెడ్డితో పాటుగా వివేక్, మరో మహిళా ముఖ్య నేత, సీనియర్ నేత పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారం పైన వివేక్ స్పందించారు.
తాను బీజేపీ వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ప్రచారాన్ని వివేక్ ఖండించారు. గత కొంత కాలంగా ఇదే రకమైన ప్రచారం సాగుతోందని గుర్తు చేసారు. తాను కాంగ్రెస్ లో ఎవరితోనూ పార్టీ మార్పు పైన చర్చలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీకి రాజీనామా చేయటం లేదని ప్రకటించారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని...వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేసారు.
రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసారో తనకు తెలియదన్నారు. తెలంగాణలో బీజేపీ విజయం కోసం తాను పని చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, వివేక్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడటం లేదని క్లారిటీ ఇచ్చేసారు. ఇదే సమయంలో వచ్చే లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతున్నట్లు చెప్పారు. దీని ద్వారా వివేక్ బీజేపీలోనే కొనసాగుతారనే అంశం పైన స్పష్టత వచ్చింది.












Click it and Unblock the Notifications