ఆ పేరే ఆకాశమంత కీర్తినిచ్చింది: 70 ఏళ్ల తనకు ఇంకేం కావాలంటూ కేసీఆర్ భావోద్వేగం

కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తీసుకువచ్చిన పేరే ఆకాశమంత పెద్దదని.. ఆ కీర్తిని మించిన పదవి ఉన్నదా? నా అంత ఎక్కువ కాలం పని చేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవడూ లేడు. ఈ కీర్తి నాకు చాలు' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జగిత్యాల బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

'చాలా క్లియర్‌గా జగిత్యాలలో చెబుతున్నా. చాలా మందికి తెలుస్త లేదు. నాకేం కావాలి..? తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశమంత పెద్దది. దాన్ని మించిన పదవి ఉన్నదా? అయినా మీరు మన్నించి ఇచ్చారు కాబట్టి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా. నా అంత ఎక్కువ కాలం పని చేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవడూ లేడు. ఈ కీర్తి చాలు నాకు' అంటూ కేసీఆర్ కొంత భావోద్వేగానికి గురయ్యారు.

vote wisely: KCR appeal to people in jagtial and vemulawada public meetings

'నేను కొట్లాడేది నా పదవి కోసం కాదు. ఖచ్చితంగా తెలంగాణ వందకు వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలి.. అది నా పంథం. కేరళ రాష్ట్రం మాదిరిగా వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలి. రైతాంగం గుండెమీద చేయి వేసుకొని ఆ హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. దాని కోసం తండ్లాడున్నాం తప్పితే ఈ పదవి కోసం కాదు' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

అంతేగాక, ' నాకు 70 ఏళ్ల వయసు వచ్చింది. ఇంకా ఈ జీవితంలో. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది. పార్టీల వైఖరి, నాయకుల ఆలోచన సరళి ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగమై ఓటు వేయొద్దని మనవి చేస్తున్నా. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో చర్చ పెట్టండి.. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టండి.. తప్పకుండా బీఆర్‌ఎస్‌ పార్టీకి ఘనవిజయాన్ని చేకూర్చండి. సంజయ్‌ అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తాం. వందశాతం చేయించే బాధ్యత నాది అని హామీ ఇస్తున్నా. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌ని పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాలి అని సీఎం కేసీఆర్ కోరారు.

మరోవైపు, వేములవాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలోనూ సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. మన దగ్గర ఎన్నికలు రాగానే ఆగమాగమైతరని, అట్ల ఆగం కాకుండా, చెప్పుడు మాటలు నమ్మకుండా సొంతంగా ఆలోచించి ఓటేయాలని ప్రజలను కోరారు. అభ్యర్థుల గురించి, వారి వెనుక ఉన్న పార్టీ గురించి బాగా చర్చించి ఓటేయాలన్నారు. మీ ఓటు వేములవాడ నియోజకవర్గ ఐదేండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు.

vote wisely: KCR appeal to people in jagtial and vemulawada public meetings

'జీవితంలో ప్రధాన ఘట్టమైన నా పెండ్లి వేములవాడ ఆలయంలో జరిగింది. అందుకే వేములవాడతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. వాస్తవానికి ఇక్కడ నిజాయితీ పరుడైన చెన్నమనేని రమేశ్‌ ఎమ్మెల్యేగా ఉండె. ఆయనను మార్చాల్సిన అవసరం లేకుండె. కానీ, కోర్టులో దిక్కుమాలిన కేసుతో తేపతేపకు గడబిడ గడబిడగా ఉంటుంది. మళ్లా పరేషాన్‌ ఎందుకని, ఆయనను అంతకన్నా ఉన్నత పదవిలో పెట్టుకుందామని చల్మెడ లక్ష్మినరసింహారావుని ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలబెట్టాం' అని కేసీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కేసీఆర్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+