Hyderabad: 22న సిటీలోని ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్

హైదరాబాద్: నగరవాసులకు జలమండలి అలర్ట్ జారీ చేసింది. హైదరాబాబాద్ మహా నగరంలో ఒకరోజు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి తెలిపింది. సింగూరు ప్రాజెక్టులోని పెద్దాపూర్ పంప్ హౌస్ దగ్గరున్న 132 కేవీ కంది-పెద్దాపూర్ ఫీడర్‌లో టీఎస్‌పీడీసీఎల్ విద్యుత్ పనులు చేపట్టనుంది.

ఈ నిర్వహణ పనుల కోసం గురువారం (ఫిబ్రవరి 22న) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో పాక్షిక, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. షేక్‌పేట రిజర్వ్, బోరబండ రిజర్వ్, లింగంపల్లి రిజర్వ్, ఆన్‌లైన్ సరఫరా, ఖానాపూర్ గ్రావిటీ 1200 మిమీ మెయిన్‌లైన్ సరఫరాతో పాటు నీటి సరఫరాలో పూర్తి అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు భోజగుట్ట, బంజారాహిల్స్‌, రిజర్వాయర్‌ ప్రాంతాల్లో నీటి సరఫరాలో పాక్షికంగా ఆటంకాలు ఎదురవుతాయి.

Water supply to be hit in parts of Hyderabad city on Feb 22

అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే:

ఓ అండ్ ఎం డివిజన్-3 షేక్‌పేట్ రిజర్వాయర్(పూర్తిగా అంతరాయం), భోజగుట్ట (పాక్షికంగా).
ఓ అండ్ ఎం డివిజన్-6: బంజారాహిల్స్, ఎర్రగడ్డ రిజర్వాయర్ల ప్రాంతాల్లో (పాక్షికంగా), బోరబండ రిజర్వాయర్ ప్రాంతాల్లో(పూర్తిగా).
ఓ అండ్ ఎం డివిజన్ 9, 15: లింగంపల్లి రిజర్వాయర్ ప్రాంతాల్లో, ఆన్‌లైన్ సప్లయ్(పూర్తిగా).
ఓ అండ్ ఎం డివిజన్-18: ఖానాపూర్ గ్రావిటీ 1200 ఎంఎం మెయిన్ ఆన్‌లైన్ సప్లయ్ ప్రాంతాల్లో పూర్తిగా అంతరాయం ఏర్పడనుంది.

ఈ క్రమంలో పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి కోరింది. పనులు పూర్తయిన వెంటనే తాగు నీటి సరఫరా యథావిధంగా కొనసాగుతుందని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+