సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉన్నాం.!తెలంగాణా పోలీస్ ది బెస్టు అంటున్న డీజీపీ అంజనీ కుమార్.!
హైదరాబాద్ : సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు సైబర్ సేఫ్టీకీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంలో తెలంగాణా పోలీస్ లు దేశంలోనే ముందంజలో ఉంన్నారని తెలంగాణా డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. న్యూఢిల్లీ నుండి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్ ఇండియా సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీ-2023 అనే అంశంపై ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సదస్సులో డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడారు. నేషనల్ ఆర్కిటెక్చర్ ఫర్ సోబర్ స్పేస్ మేనేజ్ మెంట్ బై స్లేట్ గవర్నమెంట్ అనే అంశంపై డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడారు. సైబర్ నేరాలను దర్యాప్తు చేసి, వాటిని అరికట్టేందుకై సైబర్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటుచేసిన మొట్ట మొదటి రాష్ట్రం తెలంగాణా అని అంజనీ కుమార్ అన్నారు.
సైబర్ నేరాలు పెరుగుతున్నాయి..
మైక్రోసాఫ్ట్ తో సహా ప్రపంచంలోని దాదాపు 600 ప్రముఖ ఐటి కంపెనీలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయని, దాదాపు 10 లక్షల మంది ఐటి ఆధారిత ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ ఇక్కడ ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో సైబర్ లిటరేట్స్ గణనీయంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే, ప్రపంచ వ్యాప్తం గా జరుగుతున్న మాదిరిగానే సైబర్ నేరాలు పెరిగాయని అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో 2019 లో 2691 సైబర్ ఆధారిత కేసులు నమోదు కాగా, 2020 లో 5024 , 2021 లో 10,303 , 2022 లో 15,217 నమోదు అయ్యాయని అంజనీ కుమార్ వివరించారు.

సైబర్ సెక్యూరిటీ లో ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని వెల్లడించారు. బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ బ్యూరోలో 500 మంది అధికారులు, సిబ్బందిని నియమించామని వివరించారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకై ఇప్పటికే ఏర్పాటు చేసిన తెలంగాణా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కీలక పాత్ర వహిస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లను ఏర్పాటు చేశామని అంజనీ కుమార్ తెలిపారు.

సైబర్ క్రైం తగ్గించేందుకు ప్రత్యేక్షశిక్షణలు..
అంతే కాకుండా టోల్ ఫ్రీ నెంబర్ 1930 , 100 ల ద్వారా సైబర్ నేరాల ఫిర్యాదులను నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలకు సంబంధించి 65 కోట్ల రూపాయలను నిలిపివేశామని అన్నారు.పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకై పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని 800 పోలీస్ స్టేషన్లలో సైబర్ క్రైమ్ లు ఎదుర్కొనేందుకై పోలీస్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ వారియర్లుగా తయారు చేశామని అంజనీ కుమార్ పేర్కొన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications