ప్రధాని వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నాం.!మోదీ తెలంగాణ వ్యతిరేకి.!మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్.!

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి మండిపడ్డారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి అని ధ్వజమెత్తారు. తెలంగాణ పట్ల విషాన్ని నింపుకున్న ప్రధాన మంత్రికి, తెలంగాణ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేసారు. గుజరాత్ లోని దహోడ్ లో 20వేల కోట్ల రూపాయలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారని, కానీ రాష్ట్ర పునర్ విభజన హామీలో భాగమైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మాత్రము మొండి చేయి చూపించారని, కేవలం 520 కోట్ల రూపాయలతో కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ కాజీపేట లో పెట్టి గుజరాత్ కు కోచ్ ఫ్యాక్టరీని తీసుకుపోయారని కేటీఆర్ మండిపడ్డారు.

ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారు : తెలంగాణకు 520 కోట్ల రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి గుజరాత్ కి 20000 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ తీసుకుపోయిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారన్నారు కేటీఆర్. ప్రధానమంత్రి బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని, ఇదే వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ హామీని ఇప్పటి దాకా నెరవేర్చని ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పిన ప్రధానమంత్రి ఆ హామీని నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని, తొమ్మిదేళ్ల పాటు కాలయాపన చేసిన ప్రధానమంత్రి ఇప్పుడు తెలంగాణకు 520 కోట్ల రూపాయలతో బిచ్చం వేసినట్లు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి కేటీఆర్.

modiktr
ప్రధాని పర్యటనను పూర్తిగా బహిష్కరిస్తున్నాం : తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు కేటీఆర్. మతం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టిన ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరని, ప్రధాని పర్యటనను పూర్తిగా బహిష్కరిస్తున్నామన్నారు. తెలంగాణ అధికారులు ఎవరు కూడా మోదీ కార్యక్రమానికి హాజరుకాబోమన్నారు కేటీఆర్. ధరణి విదేశీ చేతిలో ఉందన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కూడా విదేశీ చేతుల్లోనే ఉందన్న అంశాన్ని గుర్తించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిజెపి పైన ఒక మాట ఎందుకు మాట్లాడడని, మోడీని బిజెపిని ఒక మాట అనకుండా రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడని, అందుకే గాంధీ భవన్లో గాడ్సే దూరిండు అని మేము గతంలో చెప్పామని కేటీఆర్ గుర్తు చేసారు.

ktrslamsmodi
రేవంత్ రెడ్డి 100% ఆర్ఎస్ఎస్ మనిష : రేవంత్ రెడ్డి 100% ఆర్ఎస్ఎస్ మనిషని, బిజెపి మనిషని, రేవంత్ రెడ్డి దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సైతం అందించి విచారణ చేయించుకోవచ్చన్నారు కేటీఆర్. ధరణి ద్వారా జరిగిన లబ్ధిని మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ప్రజలకు చెప్తామన్నారు. ఈ అంశాన్ని ప్రజలే తేల్చుకోవాలన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన రేవంత్ రెడ్డి... ఈరోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ అయితే ఓర్వలేక పోతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.


మోదీ పైన పోరాటం చేస్తుంది ఒక్క కేసీఆర్ మాత్రమే : గత మూడు సంవత్సరాలలో భారత రాష్ట్ర సమితి మోడీ మీద బీజేపీ మీద చేసిన విమర్శలలో కనీసం 10% అయినా కాంగ్రెస్ పార్టీ చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బిజెపి కలిసే కదా కరీంనగర్ పార్లమెంటును గెలిచిందని కేటీఆర్ ఎద్దేవా చేసారు. ఆ తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికలలో కాంగ్రెస్ బిజెపి కలిసి పని చేసాయని, ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. ప్రజలు అమాయకులు కాదని, ఎవరును మోడీని వ్యతిరేకించి, గట్టిగా నిలబడి కొట్టగలరో ప్రజలందరికీ తెలుసన్నారు కేటీఆర్. మోడీ పైన తలవంచకుండా పోరాటం చేసే వ్యక్తి ఎవరో దేశ ప్రజలందరికీ కూడా అవగాహన ఉందని, అందుకే మహారాష్ట్ర లాంటి చోట కూడా చంద్రశేఖర్ రావు పర్యటనలకు మంచి స్పందన వస్తుందన్నారు కేటీఆర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+