వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవీఎంలను మేము నమ్మం నిజామబాద్ రైతులు

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ పార్లమెంట్ సమస్య మళ్లి మొదటికి రానుందా ? తమ ఉద్దేశ్యం నెరవేరకుండా వదిలేందుకు ఎర్రజొన్న,పసుపు రైతులు సిద్దంగా లేరు, కేంద్ర,రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ వేయకుండా చూస్తున్నారు రైతులు,ఈనేపథ్యంలోనే నిజామాబాద్ లో ఎన్నికలు బ్యాలెట్ పేపర్స్ ద్వారనే నిర్వహించాలని తీర్మాణం చేశారు పోటీలో ఉన్న రైతులు.

185 మంది పోటితో రికార్డులోకి ఎక్కిన నిజామాబాద్ పార్లమెంట్

185 మంది పోటితో రికార్డులోకి ఎక్కిన నిజామాబాద్ పార్లమెంట్

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటి సంఖ్యలో నామినేషన్ వేసిన రైతులు తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు ముందుకు సాగుతున్నారు.ఈనేపథ్యంలోనే మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఎర్రజోన్న ,పసుపు రైతులు,తమ ఆందోళనలో భాగంగా ఎన్నికల్లో నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే,దీంతో అక్కడ 178 మంది రైతులు ఇండిపెండెంట్ గా నామినేశన్ వేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బ్యాలెట్ పేపర్ ద్వార ఎన్నికలు నిర్వహింస్తే ఎన్నికల ప్రక్రియతోపాటు ఓటు వేసేందుకు కూడ ఓటర్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది.దీంతో అక్కడ రిజల్ట్ కూడ రోజుల తరబడి పట్టే అవకాశం ఉంటుందీ .ఈనేపథ్యంలోనే పాలకుల దృష్టిని అకర్షించవచ్చనే అభిప్రాయంతో అక్కడి రైతులు ఉన్నారు.

బ్యాలెట్ or ఈవీఎం పై తర్జనభర్జన

బ్యాలెట్ or ఈవీఎం పై తర్జనభర్జన

ఈ సమయంలో కేంద్ర ఎన్నికల కమీషన్ కు రాష్ట్ర ఎన్నికల అధికారులు లేఖలు పంపారు.ఎన్నికలకు సంబంధించి ఏవిధంగా నిర్వహించాలనే స్పష్టత ఇవ్వాలని కోరారు.మరోవైపు బ్యాలెట్ పేపర్ల ద్వార నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. అయితే రాష్ట్ర ఎన్నికల అధికారులు పంపిణ లేఖలపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమీషన్ ఈవిఎమ్ ల ద్వారనే ఎన్నికలు జరిపేందుకు నిర్ణయించింది. సంబంధిత ఈవిఎం మిషన్ల తయారి సంస్థ అయినా ఈసిఐఎల్ కు దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాని కోరింది. దీంతో అక్కడి ఎన్నికలను ఎం-3 ఈవిఎమ్ లతో నిర్వహించాలని నిర్ణయించారు.

M-3 ఈవీఎంలతోనే ఎన్నికలు

M-3 ఈవీఎంలతోనే ఎన్నికలు

ప్రస్తుతం ఉన్న ఈవీఎంల ద్వార కేవలం 63 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే నమోదవుతాయి.అయితే 2007 లో వచ్చిన కొత్త టెక్నాలజీతో 384 మంది వరకు అభ్యర్థులు పోటిలో ఉన్నా ఈవీఎం ల ద్వారే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి దీంతో ఎం-3 ఈవీఎం ల ద్వార ఎన్నికలు నిర్వహించేందుకు ఈసి నిర్ణయించింది.అయితే అంతకంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం బ్యాలెట్ పేపర్ ద్వారే ఎన్నికలు జరగుతాయి.

కాగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 1,788 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ లెక్కన 1,788 M-3 టైపు ఈవీఎంలు అవసరముంటుంది. అలాగే మొత్తం 26,820 బ్యాలెట్‌ యూనిట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు ఎన్నికల అధికారులు. 2,240 కంట్రోల్‌ యూనిట్లు, 2,600 వీవీప్యాట్‌‌లను వినియోగించనున్నట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు.

English summary
the farmers who is contesting in nazamabad loksabha constiuency, unlike to conduct the election by EVM'S but they would like to conduct the election by ballot paper ,they decide in a meeting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X