రైతు రుణమాఫీ కానివారికి రేవంత్ సర్కారు గుడ్‌న్యూస్

నల్డొండ: రూ. 2 లక్షల్లోపు రైతు రుణమాఫీపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. చాలా మంది లబ్ధిదారులకు మాఫీ అందలేదని విపక్ష నేతలు విమర్శిస్తుండగా.. అర్హులందరికీ న్యాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేశామని రూ.2 లక్షల పైబడిన వారికి సైతం రుణమాఫీ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.

ఏదేని కారణాల వల్ల రూ. 2 లక్షల లోపు ఉన్న రుణం మాఫీ కానీ ఖాతాదారుల వివరాలు సేకరించి, పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేందుకు వ్యవసాయ అధికారులకు జారీ చేశామన్నారు. ఇంకా, ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ప్రతి బ్యాంకు, వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద నియమించిన నోడల్ అధికారులను సంప్రదించాలని సూచించారు. అప్పటి వరకు 22,37,848 మంది రుణ ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు తెలిపారు.

We will give loan waiver to all eligible Thummala Nageswara Rao

31వేల కోట్లు రుణమాఫీ అని రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. వాళ్లకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడంలేదు. మూడు విడతల్లో రుణమాఫీ అవుతుందని చెప్పాము. రెండు లక్షలపైన రుణం ఉంటే రెండు లక్షలకు ఎంత రుణం ఎక్కువ ఉందో వారు ఆ డబ్బులను అకౌంట్​లో జమ చేస్తే రూ.2లక్షల రుణమాఫీ అవుతుంది. రుణమాఫీ జరగని వారు ప్రతిగ్రామంలో రైతువేదిక ఉంటుంది అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తే మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే ఇచ్చిన హామీలను అమలు చేశామని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వమన్నారు. నల్గొండ జిల్లా రైతాంగానికి ఉపయోగపడేలా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+