డబ్బులిస్తేనే ఓట్లేస్తాం.. అంబేద్కర్ కమ్యూనిటీ సెంటర్ ముందు ఓటర్ల ఆందోళన video
వరంగల్ లోక్సభ పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అయ్యింది. పర్వతగిరి మండల కేంద్రంలో, సంగెం మండలంలోని పల్లారు గూడాలో, వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటలో ఉదయం ఈవీఎంలు మొరాయించగా, సాంకేతిక సిబ్బంది ఈవీఎంలలో సమస్యలను పరిష్కరించి ఓటింగ్ సజావుగా సాగేలా చేశారు.
ఓటు వేసిన అభ్యర్థులు
వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి బిజెపి తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆరూరి రమేష్ కాజీపేటలోని బిషప్ బెరేటా స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి హనుమకొండ లోని టీచర్స్ కాలనీ ఫేస్ వన్ లోని కమ్యూనిటీ హాల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ కూడా ఓటేశారు.

డబ్బులివ్వలేదని ఓటర్ల ఆందోళన
ఇదిలా ఉంటే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ నుండి పడమర కోట దళిత కాలనీలో ఏ పార్టీ తమకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ముందు వారు నిరసన చేపట్టారు. తమ పక్క కాలనీలలో డబ్బులు పంచారని, మిత్రమా ఎందుకు డబ్బులు ఇవ్వలేదని వారు నిలదీశారు. డబ్బులు ఇవ్వకుండా ఎలా ఓటేయాలని వారు ప్రశ్నించారు.
డబ్బులిస్తేనే ఓట్లు వేస్తామన్న ఓటర్లు
డబ్బులు వాళ్ళ ఇళ్లల్లో నుంచి ఇస్తున్నారా అంటూ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తేనే తమ ఓట్లు వేస్తామని, లేదంటే ఓటు వేసేది లేదని వారు తేల్చి చెప్పారు. ఓటర్లు ఇలా బాహటంగా, నిర్మోహమాటంగా డబ్బులు ఇవ్వమని అడగడం ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తుంది.
పోలింగ్ శాతం పెంచటంపై అధికారుల దృష్టి
మరోవైపు వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెంచడానికి అధికార యంత్రాంగం మోడల్ పోలింగ్ స్టేషన్లు, యువ పోలింగ్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు, దివ్యాంగుల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేసి, వాటిని అందంగా డెకరేట్ చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. వరంగల్ లోక్సభ పరిధిలో ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వరంగల్ లోక్సభ ఎన్నికల అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications