హెలికాఫ్టర్ తో పూలు చల్లి నల్గొండలో మంత్రి కోమటిరెడ్డికి ఘన స్వాగతం; ఆయన ఏమన్నారంటే!!
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇప్పుడిప్పుడే తమ సొంత జిల్లాలకు వెళుతున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి సొంత జిల్లాలకు వెళుతున్న మంత్రులకు, అక్కడి ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తుంది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు వెళ్ళగా, నల్గొండలో అక్కడి ప్రజలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఘనంగా స్వాగతించారు. హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు.
నల్గొండ పర్యటనలో భాగంగా రోడ్ల, భవనాలు, సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు. ప్రతి పేదవాడి కన్నీరు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది అని పేర్కొన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 20ఏళ్ళు ఒక లెక్కా.. ఇప్పుడు ఒక లెక్కా.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు.

మాట తప్పం మడమ తిప్పం అంటూ పేర్కొన్న ఆయన నల్గొండలో గుండాయిజం, రౌడీయిజం లేకుండా చేస్తానన్నారు. 24 గంటలు నల్గొండ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. నల్గొండలో అద్భుతంగా తీర్చిదిద్దుతామని, జిల్లాలో ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. గత పదేళ్లలో గజ్వేల్, సిద్దిపేట్, సిరిసిల్ల తప్ప.. ఎక్కడ అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. బెల్ట్ షాపులను ముయిస్తామని, గంజాయి గ్యాంగుల ఆట కట్టిస్తామని పేర్కొన్నారు. 6గ్యారంటీలను 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేశాం, ఈ నెల చివర్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ క్రింద 10 లక్షల వరకుఉచితంగా ట్రీట్మెంట్ తీసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు.
హెలికాఫ్టర్ తో పూలు చల్లి నల్గొండలో మంత్రి కోమటిరెడ్డికి ఘన స్వాగతం..!#KomatiReddyVenkataReddy #TelanganaCongress #Nalgonda #Telangana #Oneindiatelugu pic.twitter.com/b5a2qzIiBG
— oneindiatelugu (@oneindiatelugu) December 18, 2023
ఆడబిడ్డలంతా ఎంతో సంతోషంగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుందన్నారు. 10 యేండ్ల నియంత పాలన పోయి.. నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. నల్గొండ జిల్లాను సుభిక్షంగా మారుస్తామన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications