వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుట్ట వ్యభిచార గృహాలపై ఏం చర్యలు తీసుకున్నారు?: పోలీసులకు హైకోర్టు ప్రశ్నలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి సమీపంలోనే వ్యభిచార గృహాల నిర్వహణ జరుగుతున్న విషయంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా తీసుకున్న హైకోర్టు.. సోమవారం విచారణ చేపట్టింది.

<strong>అక్కడ వ్యభిచారం, విస్తుపోయే వాస్తవాలు: ఎక్కడెక్కడికో లింక్‌లు, ఆ అమ్మాయిలే టార్గెట్ </strong>అక్కడ వ్యభిచారం, విస్తుపోయే వాస్తవాలు: ఎక్కడెక్కడికో లింక్‌లు, ఆ అమ్మాయిలే టార్గెట్

మహిళల, యువతులను, బాలికలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపి వ్యాపారం చేస్తున్న ముఠాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కోర్టుకు తెలపాలని పోలీసు శాఖను ఆదేశించింది.

what actions taken against prostitution houses, high court asks yadadri police

యాదాద్రి పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి మంగళవారం(అక్టోబర్ 23న) స్వయంగా కోర్టుకు హాజరై ఈ కేసుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పోక్సో చట్టంతో బాధితులను రక్షించడానికి స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని పేర్కొంది.

తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఐదు దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఈ వ్యభిచార దందాలోకి చిన్న పిల్లలను కూడా దింపుతున్నారనే ఇటీవల మీడియాల్లో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. చిన్న పిలలలను ఎత్తుకొచ్చి వారిని బలవంతంగా వ్యభిచారిణులుగా మారుస్తున్నారు ఇక్కడి వ్యభిచార గృహాల నిర్వాహకులు.

బాలికల శారీరక ఎదుగుదల కోసం ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఉపయోగించడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ ముష్కాన్‌ను ముమ్మరం చేసిన ముఠా సభ్యుల చెరలో నుంచి బాలికలకు విముక్తి కల్పించారు. కొందరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

English summary
High Court asked Yadadri Police department that what actions taken against prostitution houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X