జన్వాడ ఫాంహౌస్ రేవ్ పార్టీలో అసలేం జరిగింది?: రఘునందన్ రావు
హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్, రేవ్ పార్టీ విషయంపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలో అంటూ వెచ్చల విడిగా డ్రగ్స్ దందా జరుగుతోందన్నారు. విదేశా మాదక ద్రవ్యాలతోపాటు కొకైన్ విచ్చలవిడిగా నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారని అన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగిందని వార్తలు వచ్చాయన్నారు.
శనివారం రిజర్వుడ్ కాలనీలోని రాజ్ పాకాల (కేటీఆర్ బావమిరిది) ఫౌంహౌస్‌లో ఏం జరిగిందో బయటపెట్టాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం గజ్వేల్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైపు డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామంటూ ప్రకిస్తుంటే.. మరోవైపు, శని, ఆదివారాలు వచ్చ్చాయంటే రేవ్ పార్టీలని, రావుల పార్టీలని విచ్చలవిడిగా డ్రగ్స్ దందా జరుగుతుందన్నారు.

విదేశీ మాదక ద్రవ్యాలతోపాటు ఫారిన్ లిక్కర్, కొకైన్ తీసుకొచ్చి భాగ్యనగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారని అన్నారు. శనివారం రాత్రి జాన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందని, అందులో చాలా మందివీఐపీల పిల్లలు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయని చెప్పారు. వెంటనే రాజ్ పాకాల ఫాంహౌస్ రేవ్ పార్టీలో ఏ జరిగిందో సీసీటీవీ ఫుటేజీ విడుదల చేయాలని రఘునందన్ రావు డీజీపీ జితేందర్ కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ ఫాంహౌస్ యజమాని రాజ్ పాకాలతో కుమ్మక్కు కాకపోతే.. డీజీపీ ఆ ఫాంహౌస్ చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీని వెంటనే రిలీజ్ చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సమయం మించిపోతే సీసీటీవీ ఫుటేజీ ఎడిట్ చేసి, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.












Click it and Unblock the Notifications