వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ దయతో ప్రాణాలు రక్షించారా : యుద్దంలో చిక్కుకున్నవారితో.. : కేటీఆర్ సీరియస్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా యుద్దం వేళ అనేక మంది భారతీయులు అక్కడ చిక్కుకున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిలో విద్యార్ధులే ఎక్కువగా ఉన్నారు. వారిని ఆపరేషన్ గంగా పేరుతో కేంద్రం ప్రత్యేకంగా వాయు సేన విమానాల ద్వారా స్వదేశానికి తరలిస్తోంది. ఇందు కోసం నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలను పంపారు. వారు అక్కడ నుంచి వాయుసేన విమానాల్లో స్వదేశానికి భారతీయుల ను పంపుతున్నారు. ఆ సమయంలో కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు.. జై మోడీ నినాదాల పైన తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించే సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 'పీఆర్‌ ఎక్సర్‌సైజ్‌'గా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేసారు. ప్రధాని నరేంద్ర మోదీ దయ వల్లేప్రాణాలు దక్కాయంటూ..ఉక్రెయిన్ నుంచి తరలించిన విద్యార్థులకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెబుతున్న వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఆ వీడియో క్లిప్ లో ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చిన విమానంలో కేంద్ర మంత్రి అజయ్ భట్ విద్యార్ధులతో మాట్లాడారు. ఆ సమయంలో ప్రధాని మోదీ దయ వలనే ప్రాణాలతో బయట పడ్డారంటూ వ్యాఖ్యానించారు.

What nonsense, Did Modi save the lives in Russia Ukraine war:KTR slams BJP for false campaigning

భారత్ మతాకు జై అంటూ...కొనసాగింపుగా విద్యార్ధులతో మోదీ జీ జిందాబాద్ అనే నినాదాలు చేయించారు. దీనిని పోస్టు చేసిన కేటీఆర్ ఆందోళనతో..ఆవేదనతో ఉన్న విద్యార్ధుల తో ఏంటీ ఈ విధానం అంటూ ప్రశ్నించారు. కాగా, ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 16 వేల మందిని స్వదేశానికి తరలించినట్లు కేంద్ర విదేశాంగా శాఖ ప్రకటించింది. రాబోయే 2, 3 రోజుల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తారని కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్దుల కోసం ఢిల్లీలోని ఏపీ -తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు చేసారు. ఢిల్లీ నుంచి వారిని స్వరాష్ట్రాలకు పంపుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించారు.

English summary
Minister KTR slammed BJP and Modi for campaigning that with PM Modi's phone call the Russia Ukraine war has stopped and many lives were saved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X