వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్కంఠ: నోటుకు ఓటు కేసులో ఏం జరుగుతుంది?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో బుధవారంనాడు ఏం జరగబోతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఆడియో, వీడియో టేపులపై, మొబైల్ ఫోన్ సంభాషణలపై ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక బుధవారంనాడే అందే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో జైలులో ఉన్న తెలంగాణ టిడిపి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది. నోటుకు ఓటు కేసులో నాలుగో నిందితుడు జెరూసెలం మత్తయ్య అరెస్టుపై స్టే కూడా ఈ రోజే ముగుస్తోంది.

ఈ నేపథ్యంలో నోటుకు ఓటు కేసు కీలకమైన మలుపు తీసుకుంటుందని భావిస్తున్నారు. జెరూసలేం మత్తయ్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం తెలియచేస్తూ హైకోర్టులో తెలంగాణ ఏసిబి మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో నేరాన్ని ప్రోత్సహించిన మత్తయ్య పరారీలో ఉన్నారని, ఆయనకు మరో రాష్ట్రం ఆశ్రయం కల్పించడం, ప్రజాస్వామ్య దేశంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామమని ఏసిబి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏసిబి మంగళవారం రెండు కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేసింది.

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహలు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను వ్యతిరేకిస్తూ ఏసిబి అఫిడవిట్లను దాఖలు చేసింది. ఈ కేసులో మత్తయ్యను విచారించాల్సి ఉందని, ఇది చాలా ప్రాధాన్యత ఉన్న కేసు అని తెలిపింది. మత్తయ్యను విచారిస్తేనే కేసు ఒక కొలిక్కి వస్తుందని తెలిపిందని, అందుచేత వెంటనే ఏసిబికి లొంగిపోవాలని మత్తయ్యను ఆదేశించాలని హైకోర్టును కోరింది.

What will happen in cash for vote?

మత్తయ్య వివరాలను ఏపి ప్రభుత్వం తెలియచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే రేవంత్‌రెడ్డి తదితరులకు బెయిల్ ఇవ్వరాదని, ఈ కేసులో నాల్గవ నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని ఏసిబి చెప్పింది. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక అందాల్సి ఉందని తెలిపింది. ఈ నివేదిక వచ్చిన తర్వాతే ఆడియో,వీడియో టేపుల శాస్ర్తియ పరీక్ష ఫలితాలు బహిర్గతమవుతాయని వెల్లడించింది.

ఓటుకు నోటు స్కాం కేసులో ఫిర్యాదిదారుడు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా కేసు ఏ మలుపు తిరుగుతుందనే ఆసక్తికి కారణమైంది. నాల్గవ నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్‌ను విచారించరాదని, ఈ కేసు విచారణ నుంచి వైదొలగాలని న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర్‌రావును అభ్యర్ధించారు.

ఈ నెల 18వ తేదీన మత్తయ్య దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ విచారణ, అంతకు ముందు పరిణామాలు చూస్తే తనకు సందేహం కలుగుతోందని అన్నారు. ఈ నెల 18వ తేదీన నిందితుడు మత్తయ్య తరఫున హైకోర్టులో ఏపికి చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడం అసాధారణమన్నారు. ఒక కేసులో పరారీలో ఉన్న నిందితుడి తరఫున ఒక పబ్లిక్‌ప్రాసిక్యూటర్ వాదించడం నేర న్యాయ వ్యవస్ధలో అసాధారణంగా ఉందన్నారు.

ఈ స్థితిలో స్క్వాష్ పిటిషన్ విచారణకు సంబంధించి తనకు భయాలు ఉన్నాయని, అందుకే ఈ కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాలని స్టీఫెన్‌సన్ కోర్టును అభ్యర్ధించారు.

English summary
As the Telangana ACB has filed counter in Telangana Telugudesam party MLA Revanth Reddy's bail petition and other developements in cash for vote case may lead to take turns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X