Inter Result 2024: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..!

తెలంగాణలో ఈ మధ్యే ఇంటర్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంటర్ పరీక్షల పేపర్ మూల్యంకనం కొనసాగుతోంది. వీలైనంత త్వరగా మ్యూలంకనం పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని ఇంటర్ బోర్డు సిద్ధమైంది. ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్, సెకండియర్ లో 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 4,78,527 మంది ఉండగా.. 4,43,993 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.

ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో మే 13 లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఉంది. ఈలోపే ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత ఎంసెట్ పరీక్ష కూడా నిర్వహించనున్నారు. అందుకే ఎప్రిల్ మూడో లేదు నాలుగో వారంలో ఇంటర్ ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పేపర్ వాల్యూయేషన్ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

When will the Telangana Inter results be released

ఇంటర్ పరీక్ష పత్రాలను నాలుగు దఫాల్లో మూల్యంకనం చేస్తారు. ఇప్పటికే జవాబు పత్రాల మొదటి దశ మూల్యంకనం పూర్తయింది. ప్రెసెంట్ రెండో దఫా వాల్యూయేషన్ కొనసాగుతోంది. మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ రెండో వారంలో మూల్యంకనం పూర్తు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత డేటా ఎంట్రీకి సమయం పడుతుంది. అంత పూర్తయ్యేసరికి రెండు నుంచి మూడు వారాలు పడుతుంది. అంటే ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

అటు ఏపీలో కూడా ఇంటర్ జవాబు పత్రాల వాల్యూయేషన్ కొనసాగుతోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడంతో తెలంగాణ కంటే త్వరగా ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+